Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
బాబు వైఖరితోనే నిధులు రావడం లేదు

Published on : 11-Feb-2018 | 17:57
 

నరసాపురం: రాష్ట్రానికి కేటాయిస్తున్న, విడుదల చేస్తున్న నిధులు అవినీతి మయం అవుతున్నాయనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై చిన్న చూపు చూస్తోందని ఎంపి వైవి సుబ్బారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధత, అవినీతి వల్లే విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేది లేనిది అన్న దానిపై ఎమ్మెల్యేలందరితో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 
ప్రత్యేక హోదా విషయంలో కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడతామన్నారు.  శాసనసభ్యులను కొనుగోలు చేయడాన్ని వ్యాపారంగా పెట్టుకుని టిడిపి పనిచేస్తోందని మండిపడ్డారు.  విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయిన కారణంగానే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్ధితిలో ఉన్నారన్నారు.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com