Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                                వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున క‌న్నుమూత‌                               ర‌మ‌ణ దీక్షితులు లేవ‌నెత్తిన అంశాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               బాబూ..బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటున్నావ్ జాగ్ర‌త్త‌: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               ప్ర‌తి ఐటీడీఏ ప‌రిధిలో మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ కాలేజీలు, సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               గిరిజ‌నుల‌కు ఎలాంటి పూచిక‌త్తు లేకుండా పావ‌లా వడ్డీకే రుణాలు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
నాటకం vs నిజం

Published on : 16-May-2018 | 11:26
 


నాటకానికి ఒక అంకం నారా వారికి బింకం. తోలుబొమ్మలాటలో కొద్దిసేపు బొమ్మలు కాళ్లూ చేతులూ ఆడిస్తూ, తమాషాలు చేస్తూ మనోరజకంగా అనిపిస్తాయి. 
అలాగే టిడిపి అధినేత తన నేతలతో కాసేపు హోదా డ్రామా తెరమీద ఆడిస్తూ రక్తి కట్టిస్తాడు. శివప్రసాద్ లాంటి ఉద్దండులు, సుజనా లాంటి నట దురంధరులు, స్వయంగా బాబు లాంటి కంఠీరవులు కలిసి వేదికమీద నట సామర్థ్యాన్ని వందశాతం ప్రదర్శిస్తారు. అఫ్ కోర్స్ ఇదీ ఒక కళే. వెయ్యిమంది ప్రేక్షకులను మెప్పించేవారు కళాకరులైతే కోట్లమంది ప్రజలను నమ్మించేవారు కళాకారులు కాకుండా పోతారా? 
ప్రత్యేక హోదా కోసం కొద్ది రోజుల క్రితం వరకూ చంద్రబాబు చేసిన డ్రామాలు, యాక్టింగ్ లు, ఆయన పార్టీ నేతలు చేసిన హడావిడీ, హర్తాళ్లూ చూసిన వారెవరైనా గతంలో ప్యాకేజీ కావాలని అన్నది ఈ ముఖ్యమంత్రి కాదేమో అని భ్రమ పడ్డారు. నాటక అంకం ముగిసిపోయింది. బాబు గారు మేకప్ తీసేసారు. పార్టీ నేతలంతా ఎక్కడివారక్కడ హోదా నాటకపు బిచాణా ఎత్తేసారు. సర్కస్ వాళ్లు డేరా ఎత్తేసినట్టు విభజన హామీలపై టిడిపి చేసిన ర్యాలీలు, సభలు, దీక్షల స్టంట్లు పూర్తి అయిపోయాయి. స్టేజీ ఖాళీ అయిపోయింది. షోకి తెరపడిపోయింది. మళ్లీ ప్రజలు డైలమాలో పడ్డారు. ప్రత్యేక హోదా కోసం మోదీ తో ఢీ అంటూ ఫుల్ పేజ్ కలర్ ఫుల్ కవరేజ్ ఇప్పించుకున్న ముఖ్యమంత్రేనా అని మళ్లీ డౌటానుమానంతో జుట్టు పీక్కుంటున్నారు ప్రజలు. మరి అంత గమ్మునైపోయింది వ్యవహారం. 

నాటకం పూర్తయిపోయినా, తోలుబొమ్మలాట ఆపేసినా, సర్కస్ డేరా ఎత్తేసినా, స్టేజి షోలు మూసేసినా...జాతి గీతంలా రాష్ట్రం అంతా ఒక గొంతు మాత్రం ప్రతిధ్వనిస్తూనే ఉంది. పోరాట స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూనే ఉంది. స్టంట్లు, షోలు, ప్రచారాల కోసం కాక నిబద్ధతతో, నిజాయితీతో తన పని తాను చేసుకుపోతూ ఉంది. హోదా కోసం ఎందాకైనా అను తన పోరాట పంథాలో కదం తొక్కుతూనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విభజన హామీల సాధన కోసం నిత్యం జ్వలిస్తూ ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధిగా ప్రత్యేక హోదా ఉద్యమం విప్లవ గీతంలా సాగుతూ ఉంది. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com