Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                                నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                               ఒక్కసారి వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి..బీసీల సమావేశంలో వైయస్ జగన్                               ప్రతి బీసీ సొదరుడి మొహంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యంః వైయస్ జగన్                               మైదుకూరు నియోజకవర్గం కానగూడురులో బీసీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం                               7వరోజు దిగ్విజయంగా వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర                               బోటు ప్రమాదంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి                 
    Show Latest News
వైద్యులు అందుబాటులో లేక రోగుల ఇబ్బందులు

Published on : 17-Jul-2017 | 19:00
 

పిడుగురాళ్ల: వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ జైలాబ్దిన్‌ ఆరోపించారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం ఆయన వైద్య సేవల నిమిత్తం వెళ్లారు. దీంతో అక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడం, రోగులు పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారని, వైద్యులు లేరా అని ప్రశ్నించిన రోగులకు ఫార్మాసిస్టు , స్టాఫ్‌ నర్స్‌లు ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మాత్రలు మాత్రమే ఇస్తున్నారు. వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారిని పరీక్షించేందుకు వైద్యులు అందుబాటులో లేరని జైలాబ్దిన్‌ ఆరోపించారు. టైఫాయిడ్‌ జ్వరం వస్తే రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేవని సిబ్బంది ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని సూచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓపీ రాస్తున్నారని, ఓపీ రోగులను చూసేందుకు వైద్యులు అందుబాటులో లేరని ఆయన తెలిపారు. నామమాత్రంగా ఉదయాన్నే వైద్యశాలకు వచ్చి రిజిష్టర్‌లో సంతకం పెట్టి వైద్యులు వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు. దీని వల్ల రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోజుకు 100 నుంచి 150 మంది రోగుల వరకు ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నారని ఒకరిద్దరికి తప్ప మిగిలిన అందరికీ వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు నిరాశతో వెను తిరిగి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు ఆసుపత్రికి వచ్చి వైద్యులు లేరని వెళ్లిపోతున్నారు. రోజువారీ కూలీలు వైద్యుల కోసం రోజుల తరబడి ఎదురు చూడటమే సరిపోతుందన్నారు. కొంతమంది రోగులు గత్యంతరం లేక ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వస్తే మాత్రం ప్రభుత్వ అధికారులు ప్రత్యేకించి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వారికి వైద్య సేవలు అందించి వెంటనే వెళ్లిపోతున్నారని , చివరకు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి వైద్య సేవల్లో కూడా అధికార పార్టీ వారికి వైద్య సేవలు అందించే పరిస్థితి నెలకొందని జైలాబ్దిన్‌ ఆరోపించారు. ఈ విషయమై పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాల అధికారిణి శ్యామలను‘సాక్షి’ సోమవారం వివరణ కోరగా తాను వైద్యశాలకు వచ్చానని, రోగులను చూసి వారికి వైద్య సేవలు అందించిన అనంతరం టీబీ రోగులకు ప్రత్యేక సర్వీసులు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరానికి తాను వెళ్లానని తెలిపారు. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులకు వైద్య సేవలు అందించి మిగిలిన వారికి అందించకపోవడం ఏమీ జరగడంలేదన్నారు. తాను శిబిరాలకు వెళ్లిన సమయంలో రోగులు వైద్యశాలకు వచ్చి ఉండవచ్చేమో కానీ, తాను నిరంతరం రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com