Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
కాంట్రాక్టర్లపై బాబు వ్యామోహం

Published on : 19-May-2017 | 20:09
 

  • మహానేత వైయస్ఆర్ హయాంలోనే ప్రాజెక్ట్ పనులు  90శాతం పూర్తి
  • మిగిలియున్న పదిశాతం పనులకు బాబు తాత్సారం
  • కాంట్రాక్టర్లపై వ్యామోహంతో రూ.54కోట్ల పనులను రూ.400కోట్లకు పెంచిన వైనం
  • నిర్వాసితులకు తోడుగా ఉంటాం..న్యాయం జరిగే వరకు పోరాడుతాం
  • హీరమండలం వంశధార నిర్వాసితుల సభలో వైయస్ జగన్
శ్రీకాకుళంః వంశధార ప్రాజెక్ట్ పనులు 90 శాతం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలిపారు. వంశధార స్టేజ్ టూ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి మిగిలియున్న పదిశాతం పనులను పూర్తిచేయకుండా చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్ట్ అంచనాలను పెంచేస్తున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. 934 కోట్లకు సంబంధించిన వంశధార ప్రాజెక్ట్ కు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే  700కోట్ల పైచీలుకు ఖర్చు చేశారని  వైయస్ జగన్ గుర్తు చేశారు.  బాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి మరో 190 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. రైతులపై ప్రేమ ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా రైతులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి  సంవత్సర కాలంలోనే మిగిలియున్న 54కోట్ల పనులను పూర్తి చేసి  ఉండేవాడన్నారు. కానీ, చంద్రబాబుకి రైతులపై ప్రేమ లేదని,  కాంట్రాక్టర్ల మీద వ్యామోహం ఉందని నిప్పులు చెరిగారు. 

ఈపీసీ కాంట్రాక్ట్ కింద ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అది కచ్చితంగా పూర్తిచేయాల్సిందేనని వైయస్ జగన్ చెప్పారు. అలా చేయని పక్షంలో జైలుకు కూడ పంపించవచ్చని తెలిపారు. బాబు కాంట్రాక్టర్లతో లాలూచీ పడి మిగిలియున్న 54కోట్ల పనులను 400కోట్లకు పెంచేశాడని ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ సీఎం రమేషన్ తను తన బినామీగా తెచ్చి పనులు చేయిస్తున్నాడని తేటతెల్లం చేశారు. ప్రజల సొమ్మును బాబు నిలువునా దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.  కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు బాబు కొత్తగా జీవోలు తెచ్చి రేట్లు పెంచుతున్నాడని.. అదేమని అడిగితే,  పెట్రోలు, డీజిల్, సిమెట్అ ధరలు పెరిగాయని చెవిలో పువ్వులు పెడుతున్నాడని తూర్పారబట్టారు. బాబు కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి ఇవాళ్టికి చూస్తే పెట్రోల్, డీజిల్, సిమెంట్ ధరలన్నీ తగ్గాయని ఇసుక ఫ్రీగా ఇస్తున్నారని స్పష్టం చేశారు. కమీషన్ల కోసం అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నావ్...తమకు ఎందుకు పెంచడం లేదని రైతులు బాబును ప్రశ్నిస్తున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. వంశధార పూర్తి కావాలని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. 

అప్పట్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలని చెప్పి తమ జీవితాలు బాగుపడుతాయని త్యాగమూర్తులు ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చారని వైయస్ జగన్ తెలిపారు. ఆరోజుల్లో లక్షా 20వేలకు భూములు ఇచ్చారని తెలిపారు. పదేళ్లయినా ఇవాల్టికి ప్రాజెక్ట్ పూర్తి కాని పరిస్థితి నెలకొందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్అండ్ ఆర్ ప్యాకేజీని నిర్వాసితులు అడగడంలో తప్పేముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు తోడుగా నిలబడతామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు వేయి కోట్లు ఇచ్చేస్తే బాబుకు ఏమీ రాదనే ఇవ్వడం లేదన్నారు. అదే కాంట్రాక్టర్లకు ఇస్తే 30శాతం కమీషన్లు తీసుకోవచ్చనే వంశధార రెండో దశ పనులను బాబు ఆపుతున్నారని మండిపడ్డారు.  జిల్లాలో వంశధార, తోటపల్లి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది వైయస్ఆర్ చేశారని నేటికి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. కానీ బాబు మిగిలియున్న పదిశాతం పనులను పూర్తి చేయడం లేదు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 97 వేల కోట్లు అప్పుంటే ఈ మూడేళ్లలో 2లక్షల 16వేల కోట్లకు తీసుకుపోయాడని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో లక్షా 18వేల కోట్లు అప్పులు చేశాడని బాబుపై ధ్వజమెత్తారు. ఆయన బడ్జెట్ చూస్తే లక్షన్నర కోట్లు. మూడేళ్లలో అప్పులు చూస్తే లక్షా 18వేల కోట్లన్నాయన్నారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com