Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                జ‌మ్ము జంక్ష‌న్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 323వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
బాబు బా...గా.... బిజీ!

Published on : 09-Nov-2018 | 11:07
 

కసాయి కత్తి కమండలం పట్టుకుని ఊరూరూ తిరిగిందట. అదేంటని అడిగితే ప్రపంచశాంతికోసం అని నినాదాలు చేసిందట. ఇప్పుడు చంద్రబాబు దేశ పర్యటన కూడా అలాగే ఉందంటున్నారు రాజకీయాలు దగ్గరగా చూసేవాళ్లు. విపక్షాలను కలుస్తూ, గంటలు గంటలు చర్చలు జరుపుతున్న బాబుగారు బయటొకొచ్చి ఇస్తున్న సందేశం ఏంటంటే... ''ఈ దేశాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అందుకే నేను బిజెపికి వ్యతిరేకంగా అందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నా''అని. ఎంత విడ్డూరం, ఎంత అద్భుతం, ఎంత చోద్యం. ఆయనొక్కడికి తప్ప అందరికీ మెమరీ లాస్ అయితే ఈ విషయం వినడానికి ఎంత గొప్పగా ఉండేదో కదా! నాలుగున్నరేళ్ల క్రితం ఈ దేశాన్ని కాపాడ్డానికి ఎవరి అవసరముందని జతకట్టాడో, నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని మట్టీ, నీరు ఇచ్చినా కళ్లకద్దుకుని చాటింపు వేయించాడో... వాళ్లపై ఇప్పుడు పోరాటమట. దానికి ఆయన శక్తి చాలక దేశమంతా తిరిగి పార్టీలను కూడగడుతున్నాడట.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంరక్షణ. చెప్పే మనిషి చంద్రబాబు కాకపోతే వినడానికి ఎంత బాగుండేవో కదా! కానీ తప్పదు... ఆయన నోటివెంటే వినాల్సిన ఖర్మ పట్టింది ప్రజలకు. తాను పాలిస్తున్న రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యుల్ని కొనుగోలు చేసి అసెంబ్లీలో తన పక్కన కూర్చోబెట్టుకుని, వారికి కేబినెట్ పదవులిచ్చి మరీ గౌరవించిన బాబు... దేశంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్నారట. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా... కోర్టులు ఆ నిర్ణాయాన్ని సభాపతికే వదిలేసినాసరే, కనీసం ఆవిషయం గురించి సభలో నోరు విప్పని ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిలో పడ్డారట. ఎంత నిస్సిగ్గు రాజకీయం. ఎంత అవకాశవాదం.

పెండింగ్ లో ఉన్న కేసులనుంచి, ఓటుకు కోటులో అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం నుంచి, ఎపిలో బయటపడ్డ అవినీతినుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక దేశమంతా తిరుగుతూ దానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ లాంటి పేర్లు తగిలించుకుంటున్నాడు బాబు అని లోకం కోడై కూస్తుంది. ఇవేమీ పట్టని నిప్పు బాబు మాత్రం ఒక్కో రాష్ట్రం తిరుగుతూ.. లోపల ఏం చర్చలు జరిగినా బయటకు వచ్చి దేశంకోసం కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా అని ఒకటే రికార్డు ప్లే చేస్తున్నాడు.. వింటున్న జనం మాత్రం... బాబు బా...గా... బిజీ! అంటూ నవ్వుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com