Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
పచ్చతమ్ముళ్ల నాలెడ్జ్ పెంచుకోండి

Published on : 05-Jan-2018 | 18:24
 విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమిలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు భారతదేశంలో చదువుల విశిష్టత గురించి చెప్పుకొచ్చారు. చరిత్రను వివరించారు. సిలికాన్ వాలీలో అత్యధిక ఆదాయం తెచ్చుకునేది తెలుగువారే అన్నారు. ఆస్తులమ్మి ఒకప్పుడు చదువులు చదివించారన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ గా, ఎడ్యుకేషనల్ హబ్ గా చేయాలనుకుంటున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మొత్తాన్నికి చదువుల మీద భారీ లెక్చర్ తో కార్యక్రమాన్ని ముగించేసారు చంద్రబాబు. 

చదువుల సమస్యలపై నోరు పెగల్లేదా?

అరగంటపైగా సాగిన చంద్రబాబు ప్రసంగంలో రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులుగానీ, ప్రభుత్వ విద్యా విధానం గురించి కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. వేలాదిగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల గురించి కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పిందే లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సౌకర్యాలు, నిధుల గురించి కూడా ఏమీ చెప్పిందిలేదు. లక్షల్లో పెరుగుతున్న ఫీజులపై నియంత్రణ గురించి నామమాత్రంగా అయినా మాట్లాడలేదు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ, విద్యార్థులపై వత్తిడి గురించి నోరు విప్పలేదు. 

ఉపన్యాస సారాంశం ఏమిటంటే

మరి ఈ సభ ఇందులో ఊక దంపుడు ఉపన్యాసం ఎందుకయ్యా అంటే ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా చదువు గురించి తానూ మాట్లాడానని, శ్రద్ధ చూపిస్తున్నానని ప్రకటించుకోవడం కోసం మాత్రమే. ఆయన ప్రసంగం ఆద్యంతం అదే లక్ష్యంతో సాగింది. అక్కచెల్లెళ్లందరూ పిల్లలను బడికి పంపండి, వారి చదువులకయ్యే ఖర్చు నేను చూసుకుంటాను అని ప్రజాసంకల్ప పాదయాత్రలో హామీ ఇచ్చార్ వైఎస్ జగన్. ఉన్నత చదువుల కోసం మాత్రమే కాదు, తిండి, వసతి కోసం కూడా 20000 ఇస్తామని మాటిచ్చారు. అదే విషయాన్ని పాదయాత్ర పొడవునా చెబుతూ వస్తున్నారు ప్రతిపక్షనేత. దాన్నే కాపీ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నించి భంగపడ్డారు చంద్రబాబు. ప్రతిపక్షనేత పద్ధతిలోనే పిల్లలను చదివించాలని చెప్పగలిగారు కానీ, ఫీజు రీయంబర్సు మెంట్, ఉచిత విద్య గురించి గట్టి హామీ ఇచ్చే దమ్ము చూపించలేకపోయారు. చంద్రబాబు మాటలు ఆద్యంతం ప్రతిపక్ష నేతను ఎలాగోలా కాపీ కొట్టి మాట్లాడాలని తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తుంది. ‘విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తాను, రాష్ట్ర పెద్ద గా మీ పిల్లలందరినీ పైకి తీసుకురావడం నా బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇస్తున్నాను’ అన్నారు. కానీ మహిళల నుంచి కానీ సభికుల నించి కానీ కనీసం చప్పట్లు కూడా రాలేదు. ఎవ్వరి నుంచీ ప్రతిస్పందన లేదు. దాంతో కాస్త అసహనానికి గురైన చంద్రబాబు తన ప్రసంగాన్ని టీచర్లపైకి మళ్లించారు. టీచర్లు పిల్లల్ని ప్రయోజకులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఏర్పాటు చేసానన్నారు. 

పథకాలే కాదు, ఆలోచనలనూ కాపీ కొట్టిన బాబు

పిల్లలు పొలాల్లో కంపెనీల్లో పని చేయడం కాదు, అందరూ బాగా చదువుకోవాలి అని స్టేట్ మెంట్ ఇచ్చారు చంద్రబాబు. బాల్యం విలువైనది అన్నారు. పదో తరగతి మెరిట్ లో పాసైతే ఇంటర్, ఇంటర్ మెరిట్లో పాసైతే డిగ్రీని ప్రభుత్వం తమ ఖర్చుతో చదివిస్తుందన్నారు. ఇది తనకు పుట్టిన ఆలోచనే అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. దివంగతనేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ కు తూట్లు పొడిచిన చంద్రబాబు, ఇలా మాట్లాడం చూసి ప్రజలు విస్తుపోయారు. ఉన్న స్కూళ్లను మూసేసి, కార్పొరేట్ స్కూళ్లకు గేట్లు తెరుస్తున్న చంద్రబాబుకు ఒక విద్యా విధానమంటూ ఏదీ లేదు. గత నాలుగేళ్లుగా టీచర్ పోస్టుల భర్తీలు చేయకుండా కాలయాపన చేస్తున్న బాబు, విద్యార్థులను చూసుకునే బాధ్యత టీచర్లపై ఉందని లెక్చర్ మాత్రం దంచారు. తన మంత్రిగారికి చెందిన కాలేజీల్లో ప్రాణాలు తీసుకుంటున్న వందలాది విద్యార్థులకు నేటికీ న్యాయం చేయలేదు. ఆత్మహత్యలకు కారణమైన యాజమాన్యాలను శిక్షించలేదు. పరిమితికి మించి విద్యార్థులపై భారం వేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై కొరడా ఝుళిపించలేదు. కానీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, దేశానికి పేరు తేవాలని మాత్రం ఆశిస్తున్నాని చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా చేయబోతున్నామని ప్రకటించారు. ముందు ఆయన పార్టీలోని జలీల్ ఖాన్ కు బికాంలో ఫిజిక్స్ ఉండదని తెలియజెప్పాలని, క్రీడలకు నోబెల్ బహుమతి ఉండదని చంద్రబాబుసైతం స్వయంగా తెలుసుకోవాలని, ఆధ్రప్రదేశ్ దేశం కాదని రాష్ట్రం అని పుత్ర పప్పురత్నానికి తెలియజేయాలని, ఆ తర్వాత రాష్ట్రానికి నాలెడ్జ్ పెంచేందుకు ప్రయత్నించాలని విమర్శలు చేసారు బాబు స్పీచ్ విన్న నెటిజన్లు. 

 
Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com