Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                               తుని ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?: త‌మ్మినేని సీతారాం                               బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది: త‌మ్మినేని సీతారాం                 
    Show Latest News
బాబూ.. ఈ నాలుగేళ్లు మీరెక్క‌డ‌..?

Published on : 21-Jul-2018 | 13:19
 తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి మొత్తం దేశాన్ని, పార్ల‌మెంట్‌ని క‌దిలిస్తున్న రోజు జ‌గ‌న్ ఎక్క‌డ‌..?
- చంద్ర‌బాబు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఉద్య‌మ స్ఫూర్తితో రాష్ర్టమంతా హోదా కోసం పోరాడుతుంటే .. నాలుగేళ్లు క‌ళ్లు తెర‌వ‌ని బాబు..,  హోదా ప‌క్క‌న పెట్టి స్వీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడి.., ఇప్పుడే క‌ళ్లు తెరిచాడు. తాను కూసిన‌ప్పుడే తెల్లారిన‌ట్టుగా ఫీలైపోయే కోడిపుంజులా బాబు గారి రాజ‌కీయ కొక్క‌రోకోలు ఎలా ఉన్నాయంటే.. 
అంత‌నాడు లేదు ఇంత‌నాడు లేదు.. సంత‌నాడు క‌ట్టింది ముంతంత కొప్పు అన్న‌ట్టుంది.  
నాలుగేళ్లు మీరు నోట్లో పెట్టుకున్న బెల్లం గ‌డ్డ ఇప్ప‌టికి క‌రిగిందా...
బాబు ఇవి గుర్తున్నాయా..?

- యువ‌భేరిల‌కు వెళ్లే విద్యార్థుల‌ను ఏమ‌న్నావో గుర్తులేదా..?
- వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ధ‌ర్నాలు చేస్తుంటే త‌మ‌రు ద‌గ్గ‌రుండి పోలీసుల‌తో బ‌స్సులు న‌డిపించ‌లేదా..?
- అర్ధ‌రాత్రి ప్యాకేజీ బాగుంద‌ని మోడీకి ధ‌న్య‌వాదాలు చెప్పింది మీరు కాదా..?
- విశాఖ‌లో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్లిన జ‌గ‌న్‌ను ర‌న్‌వే పైనే నిర్బంధించింది ఎవ‌రు..?
- కేంద్రంపై అవిశ్వాసం పెడ‌దామ‌ని జ‌గ‌న్ అంటే.. అప్పుడు మీరేమ‌న్నారు..? 
- నీకంటే ముందే పార్ల‌మెంట్‌లో అవిశ్వాసం నోటీస్ ఇచ్చింది ఏ పార్టీ..?
- ప్ర‌త్యేక హోదా కోసం ఎంపీ ప‌ద‌వుల‌ను త్య‌జించింది ఎవ‌రు..? 
- ప్రాణాల‌కు తెగించి ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయ‌కుల‌ను క‌నీసం ప‌రామ‌ర్శించారా..?
- హోదా పోరాటాన్ని పందుల ఆట‌తో పోల్చిన మీ పార్టీ ఎంపీపై చ‌ర్య‌లు తీసుకున్నారా..?
- అవిశ్వాసం పెట్టి మీరు ఢిల్లీలో చ‌క్రం తిప్పుతానంటే.. మీ ఎంపీలు సుజ‌నా, జేసీలు మీ మాట‌ను ల‌క్ష్య‌పెట్టారా..?
- హోదా కంటే ప్యాకేజీయే మేల‌ని మ‌హానాడులో తీర్మానం చేసింది మీరు కాదా..?
- అంతెందుకు పార్ల‌మెంట్‌లో మీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చ‌దివిన ప్ర‌సంగం నాలుగేళ్లుగా జ‌గ‌న్ చెబుతున్న‌ది కాదా
- ప్యాకేజీ బాగుంద‌ని, చాలా సాధించామ‌ని వెంక‌య్య‌, జైట్లీల‌కు సన్మానం చేసిన మీకు 
 జ‌గ‌న్ ఎక్క‌డ అని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు ఉంద‌నుకుంటున్నారా..? 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com