Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రభుత్వం మీది, అధికారంలో ఉన్నారు..ఏ విచారణ అయినా వేసుకోండిః బాబుకు శిల్పా సవాల్                               తప్పుడు ఆరోపణలతో వ్యకిత్వం దెబ్బతీయడం సరికాదుః శిల్పా మోహన్ రెడ్డి                               తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు, దుష్ర్పచారం మానుకోవాలని టీడీపీకి హెచ్చరిక                               చంద్రబాబు బెదిరింపులకు భయపడేవాడిని కాదుః శిల్పా మోహన్ రెడ్డి                               నంద్యాలలో చివరి రోజు..13వ రోజు వైయస్ జగన్ ప్రచారం                               నంద్యాలలో 12 రోజు వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం                               దళిత, క్రైస్తవ గిరిజనులంతా వైయస్ జగన్ వెంట నడవాలి..జగనన్న అండగా ఉంటాడుః మేరుగు                               రాక్షస పాలనలో మనం నలిగి చస్తున్నాంః నారాయణస్వామి                               చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన దారుణంః వైయస్ జగన్                 
    Show Latest News
బాబు లాంటి అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడు

Published on : 11-Jan-2017 | 17:55
 

కమలాపురంః బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యినా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలోనే ఇలాంటి అవినీతిపరుడిని, అబద్ధాలు చెప్పే వ్యక్తిని బాబునే చూస్తున్నామన్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.  ప్రజలను దారుణంగా వంచించి చంద్రబాబు లక్షల కోట్లు దిగమింగుతున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టుగా మాయ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు వడ్డీలో పావు కూడా రుణాలు మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. బాబు రుణాలు మాఫీ చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. వైయస్ఆర్ హయాంలోనే 90 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన కొద్దిపాటి పనుల కోసం అంచనాలను వేలకోట్లకు పెంచేసి దోచుకుంటున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com