Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                                వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున క‌న్నుమూత‌                               ర‌మ‌ణ దీక్షితులు లేవ‌నెత్తిన అంశాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               బాబూ..బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటున్నావ్ జాగ్ర‌త్త‌: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               ప్ర‌తి ఐటీడీఏ ప‌రిధిలో మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ కాలేజీలు, సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               గిరిజ‌నుల‌కు ఎలాంటి పూచిక‌త్తు లేకుండా పావ‌లా వడ్డీకే రుణాలు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
పశ్చిమవాసులకు బాబు పచ్చిమోసం

Published on : 16-May-2018 | 11:22
 

 
మాటలు కోటలు పనులు నీటి మూటలు అంటారు చంద్రబాబు తీరు తెలిసిన వాళ్లు. పశ్చిమగోదావరి జిల్లాకు 2014 ఎన్నికలప్పుడు బాబు ఇచ్చిన హామీలు అచ్చం అలాంటివే. ఆ సమయంలోఈ జిల్లాలో 4సార్లు పర్యటించాడు బాబు. 21 హామీలను గుప్పించాడు. వాటిలో ఒక్కటి కూడా నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఏలూరులో సాగుతోంది. ఈ సందర్భంలో పశ్చిమ వాసులు చంద్రబాబు తమ జిల్లాకు చేసిన అన్యాయాన్ని ఏకరువు పెడుతున్నారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా బాబు తమని దారుణంగా మోసం చేసాడని వాపోయారు. 

పశ్చిమవాసులకు ద్వారకా తిరుమల సాక్షిగా చంద్రబాబు ఇచ్చి మరచిన హామీలు ఇవి

చిన్న తిరుపతిని పెద్ద తిరుపతికి దీటుగా అభివృద్ధి చేయడం.
ద్వారకా తిరుమలను టౌన్ షిప్ గా తీర్చిదిద్దడం. 
500 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు
జాతీయ రహదారికి ద్వారాకా తిరుమల అనుసంధానం
ద్వారకా తిరుమలలో డ్వాక్రా శిక్షణా కేంద్రం, షాపింగ్ మాల్ ఏర్పాటు
ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు
ద్వారాకా తిరుమలను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడం
పశ్చిమ గోదావరి ఆయిల్ పామ్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర
పొగాకు రైతుల రుణాల మాఫీ
మత్స్యకారుల జీవనోపాధికి డ్రెయిన్లలో చేపపిల్లల ఉత్పత్తి
కలవపూడి ఆదర్శగ్రామంగా చేసేందుకు కోటి రూపాయిల నిధులు
చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ సిటీగా చేయడం..

ఇందులో కొన్ని హామీలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి. వీటిలో ఏ ఒక్క హామీ ఈ నాలుగున్నరేళ్లలో నెరవేరలేదు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కట్టబెట్టిన పశ్చిమకే నా తొలి ప్రాధాన్యం అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన వివిధ స్థాయి పర్యటనల్లో ప్రకటించినా, అవన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. జిల్లా రూపు రేఖలు మార్చేలా వందల కోట్ల ప్రాజెక్టుల హామీలను కూడా బాబు అటకెక్కించేశాడు. 
ప్రభుత్వం గరగపర్రుకు ఇచ్చిన హామీలు

పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులను అగ్రవర్ణాల వారు వెలివేసిన దారుణ సంఘటన చంద్రబాబు హయాంలో చోటు చేసుకుంది. ఈ అమానుషాన్ని ఖండిచాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. వ్యవహారం శృతిమించాక, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఈ విషయంపై న్యాయం కోరాక, చంద్రబాబు స్పందించాడు. గరగపర్రు ఉద్యమాన్ని చల్లార్చడానికి అప్పటికప్పుడు ప్రభుత్వం దళితుల డిమాండ్లను ఒప్పుకుంది. పాలక పక్ష పెద్దలు వచ్చి ఇరు వర్గాలకు రాజీ కుదిర్చి దళితుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

యధాస్థానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, బహిష్కరణకు గురైన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయిల పరిహారం, కౌలు భూములను రైతులకు ఇవ్వడం, ఇళ్లు లేని వారికి స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వడం, బహిష్కరణకు గురైన దళితులకు ఉపాధి కల్పిచడం, దళిత కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు, దళిత కాలనీలో చౌకడిపో ఏర్పాటు, మంచినీటి వసతిం.ఇవీ గరగపర్రు దళితులకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు. చంద్రబాబు కానీ, ప్రభుత్వ యంత్రాంగం నెలలు గడిచిపోతున్నా ఈ హామీలపై స్పందించడం లేదు. 
 
ప్రతి జిల్లాకూ అరచేతిలో స్వర్గం చూపినట్టే పశ్చిమగోదావరి జిల్లాకు కూడా బాబు అభివృద్ధి సినిమా చూపించాడు. ఓట్లను దండుకున్నాడు. అటు కాపులను ఆకర్షించి, మాయ మాటలు చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక కాపు ఉద్యమాన్ని అణగదొక్కి, జిల్లాకు మొండి చేయి చూపించాడు. ముఖ్యమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చున్న తర్వాత పశ్చిమ గోదావరి పర్యటనకు వచ్చిన ఆయన్ను ప్రజలు తమ హామీల గురించి అడిగారు. దానికి బాబు సమాధానం  ‘ఎన్నికల వేళ అప్పటి పరిస్థితులను బట్టి అలా హామీలిచ్చాను, ఇప్పుడు అవి నెరవేరాలంటే వేలాది కోట్లు కావాలి. ఇప్పుడు అంత డబ్బులేదు. డబ్బును సృష్టించే మంత్ర దండమూ లేదు’ నయవంచనకు నాయకుడి రూపం వస్తే అది చంద్రబాబే అని ఆ నాడు పశ్చిమ ప్రజలు అనుకున్నారు. బాబు భాగోతాల చరమాంకం కోసం ఎదురు చూస్తున్నారు. 
 

Labels : TDP, NCBN, YSRCP, YSJagan

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com