Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
బాబు అంద‌రినీ మోసం చేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌

Published on : 12-Feb-2018 | 15:26
 

నెల్లూరు: చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు వంద‌ల సంఖ్య‌లో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్క‌టీ చేయ‌కుండా అన్ని వ‌ర్గాల వారినీ మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క‌రు కూడా సంతోషంగా లేర‌న్నారు. మ‌రీ ముఖ్యంగా రైతులు, డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల రుణాలు భేష‌ర‌తుగామాఫీ చేస్తాన‌ని చెప్పి చేయ‌కుండా దారుణంగా మోసం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల‌కు, డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌కు న్యాయం చేస్తామ‌న్నారు. రైతుల‌కు ఏటా రూ.12500లు ఇస్తామ‌ని, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఎన్నిక‌ల నాటికి ఎంత డ‌బ్బు రుణం ఉంటుందో అంత నాలుగు విడ‌త‌ల్లో ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.  అంతేకాకుండా మ‌హిళ‌ల‌కు 0 వ‌డ్డీకే రుణాలు ఇచ్చే చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. వృద్ధుల‌కు రూ.2000లు పింఛ‌న్ ఇవ్వ‌డంతో పాటు పింఛ‌న్ వ‌య‌స్సును 45 ఏళ్ల‌కే త‌గ్గిస్తామ‌న్నారు. ఇళ్లులేని పేద‌లు ఉండ‌కూడ‌ద‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని, పేద‌లంద‌రికీ ఇళ్లు క‌ట్టిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 
చిట్టి పిల్ల‌లు బాగా చ‌దువుకోవాల‌ని, వాళ్లు బాగా చ‌దువుకుని మంచి ఉద్యోగాలు చేస్తేనే మ‌న త‌ల‌రాత‌లు మారుతాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే చిట్టిపిల్ల‌ల‌ను బ‌డుల‌కు పంపించే త‌ల్లుల‌కు ఏటా రూ.1500లు ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. పెద్ద పెద్ద చ‌దువుల‌ను కూడా ఉచితంగా చ‌దివిస్తామ‌ని వైయ‌స్ జగ‌న్ భ‌రోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com