Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
ఆటోడ్రైవర్‌కు ఏటా రూ.10 వేలు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా

Published on : 14-May-2018 | 22:24
 

ఏలూరు:  అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోడానికే ప్రజా సంకల్పయాత్రను చేపట్టానని చెపుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశలో అనేక ప్రకటనలు చేస్తున్నారు.161 రోజుల పాటు చేసిన పాదయాత్రలో పలు జిల్లాల్లో తనను కలిసిన సందర్భాల్లో ఆటో డ్రైవర్లు వెలిబుచ్చిన ఆవేదనకు, సమస్యలకు పరిష్కారంగా అధికారంలోకి వస్తే ఏటా పదివేల రూపాయల సహాయం ఇస్తానని సోమవారం నాడు ఏలూరు జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. స్వయం ఉపాథితో రెక్కాడితే డొక్కాడని చాలీ చాలని ఆదాయంతో గడుపుతున్న ఆటో డ్రైవర్ల జీవితాల్లో కొత్త కాంతులు నిండేలా ఆయన ఈ వరాన్ని ప్రకటించారు. పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ఈ అంశంపై హామీ ఇచ్చారు.రవాణా శాఖ నిబంధనలను అనుసరించి పలు రకాల పత్రాలు చేయించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.

  ‘‘తాను వెళ్లిన ప్రతిచోటా ఆటోడ్రైవర్లు కలుస్తూ, రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్న విషయాన్ని చెపుతూ తమ సమస్యలను పంచుకున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, రోడ్‌ టాక్స్‌ పత్రాలు లేనందున ఈ వసూళ్లు చేస్తున్నారని వారు తనతో వాపోయినట్లు చెపుతూ అధికారంలోకి వస్తే  అందుకు అయ్యే ఖర్చుల కోసం ఏటా ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయల సహాయాన్ని అందిస్తామని , దీంతో ఆటోకు బీమా వర్తించడంతోపాటు ప్రయాణికులకు రక్షణ లభిస్తుందని జగన్ వివరించారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com