Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                  
    Show Latest News
హోదా ఉద్యమాన్ని బాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా

Published on : 23-Feb-2018 | 12:50
 

తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టింది బాబే
టీడీపీ అవినీతి మంత్రి ఆదినారాయణ, మణిగాంధీ మాటల్లో బట్టబయలు
ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఇప్పుడు మళ్లీ హోదా అనడం సిగ్గుచేటు
వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబులు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మాట మార్చుతున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ డ్రామాలను ప్రజలు గ్రహించారని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త రాగం అందుకున్నాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ చైతన్యం చేసి హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే చంద్రబాబు మరోసారి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబని ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషాలు ధ్వజమెత్తారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేవారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎంత అవినీతికి పాల్పడుతున్నారో.. మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలను బట్టి అర్థం అవుతుందన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేశారో ఎమ్మెల్యే మణిగాంధీ బయటపెట్టారన్నారు. ఇంకా ఆత్మాభిమానమని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com