Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తున్నానని భరోసా ఇస్తున్నా : వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               బాబు పాల‌న‌లో ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుంది: వైయ‌స్ జ‌గ‌న్‌                               ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోంది: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                                చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                 
    Show Latest News
సంక్షేమ పథకాలు అందడం లేదు
– వైయస్‌ జగన్‌ దృష్టికి పలు సమస్యలు

Published on : 14-Feb-2018 | 18:05
 




నెల్లూరు: గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అరాచకాలు సృష్టిస్తున్నాయని, సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని నెల్లూరు వాసులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 87వ రోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పింఛన్లు మంజూరు చేయడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి పనులు చేసి మూడు నెలలు అవుతున్నా బిల్లులు అందడం లేదని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ఏడాది పాటు ఓపిక పట్టాలని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే 45 ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తామని, నెలకు రూ.2 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com