Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                జ‌మ్ము జంక్ష‌న్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 323వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
జ‌న నీరాజ‌నం
కాసేప‌ట్లో ధవళేశ్వరం బ్రిడ్జిపై వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

Published on : 13-Jun-2018 | 15:01
 



ప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ ఆర్ సీపీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర  దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించి రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. లంచ్ విరామం అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జిపై ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగ‌నుంది. ఇక్క‌డి నుంచి జ‌న‌నేత కోత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర అడుగుపెడుతోంది. 

మంగళవారం రోజున.. గోదావరికి ముందుగానే వరద వచ్చిందా.. అన్నట్లుగా కొవ్వూరు–రాజమహేంద్రవరం మధ్య అఖండ గోదావరిపై రాజన్న బిడ్డకు ప్రజలు జననీరాజనం పలికారు. గోదావరి ఉప్పెనలా.. రోడ్డు కం రైల్‌ బ్రిడ్జిపై జనం జననేతను చూడటానికి పోటెత్తారు. 4.1 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. భారీ సంఖ్యలో పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు బ్రిడ్జిపై వైయ‌స్‌ జగన్‌తో అడుగు వేశారు. కేరింతలు కొడుతూ యువత తమ నాయుకుడిని చూడటానికి గోదావరి వరదలా తరలివచ్చారు. రోడ్డు కం బ్రిడ్జి నుంచి మొదలు పెడితే రాజమండ్రి బహిరంగ సభ వరకూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గోదావరి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మంగళవారం రోజు వచ్చిన జనసముద్రం బుధవారం రోజు కూడా కొనసాగుతోంది.  తమ బిడ్డను చూడటానికి తల్లిదండ్రలు, మనుమడితో మాట్లాడటానికి అవ్వాతాతలు, అన్నతో కష్టాలు చెపుకోవడానికి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు తరలివచ్చారు. వారందరికి భరోసా ఇస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.



సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com