Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే: బొత్స సత్యానారాయణ                                ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయింది: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి.. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు: తలశిల రఘురాం                               వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3000కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది: పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం                               వర్షం కారణంగా నేటి 267వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్రకు విరామం                               వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి: పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                               రాష్ట్ర‌వ్యాప్తంగా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’                               రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారు: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                  
    Show Latest News
ఆ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
– ఎంపీ విజయసాయిరెడ్డి

Published on : 22-Feb-2018 | 18:05
 

– మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు
– చంద్రబాబు సూచనలతో ఐఏఎస్‌లు ఈ పాత్ర పోషిస్తున్నారు
– వారికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి
హైదరాబాద్‌: నలుగురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రోత్సాహంతో ఐఏఎస్‌ అధికారులు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారులపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. సీఎంవో అధికారి సతీష్‌ చంద్రతో పాటు ఐఏఎస్‌ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్, ఇంటలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల తీరును ఆయన తప్పుపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌లపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, కొందరు అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. మా పార్టీ నుంచి ఫిరాయించిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి మాటలను పరిశీలించిన ఐఏఎస్‌ల పాత్ర తేలుతుందన్నారు. రామసుబ్బారెడ్డితో వివాదాన్ని ఐఏఎస్‌లే పరిష్కరించారని ఆదినారాయణరెడ్డి అన్నారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో మా ఆరోపణలు నిజమని తేలాయన్నారు. మేం చేసిన  ఆరోపణలు బయటపెట్టాలని ఐఏఎస్‌లు కోరితే కచ్చితంగా ఆధారాలతో సహా చూపిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారులు రాజ్యాంగ విలువలను కాపాడాలని ఆయన కోరారు. 

ఫిప్ట్‌–ఫిప్ట్‌
జమ్మలమడుగు నియోజకవర్గంలో చెరిసగం తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్‌ అధికారులతో పంచాయితీ చేయించిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య వాటాల పంపిణీకి సంబంధించి ఆదినారాయణరెడ్డి తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కాంట్రాక్ట్‌లు, కమీషన్లు, వాటాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మీ ఎమ్మెల్యేని..పక్కకుపోయినప్పుడే మంత్రిని అని రామసుబ్బారెడ్డికి కూడా ప్రతి రూపాయిలో సగం వాటా ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారని, ఐఏఎస్‌ అధికారులను మాతో కూర్చోబెట్టి పంచాయితీ చేశారని ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో చెప్పారు. రామసుబ్బారెడ్డికి వచ్చిన దాంట్లో మనకు సగం వస్తుందని, మనం కూడా రామసుబ్బారెడ్డికి సగం ఇవ్వాలని, మీరెవరూ రామసుబ్బారెడ్డిపై విమర్శలు చేయొద్దని ఆదినారాయణరెడ్డి తన అనుచరులకు సూచించారు. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి, ఎస్‌ఎంఎస్‌లు పెట్టండి ప్పిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com