Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తున్నానని భరోసా ఇస్తున్నా : వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               బాబు పాల‌న‌లో ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుంది: వైయ‌స్ జ‌గ‌న్‌                               ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోంది: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                                చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                 
    Show Latest News
బాబు పోవాలి.. జ‌గ‌న‌న్న రావాలి
* ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి

Published on : 14-Feb-2018 | 14:57
 


* ఎక్క‌డ విన్నా ఇదేమాట‌
* బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మోసం చేశాడు
* హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
నెల్లూరు: ``చంద్ర‌బాబు పోవాలి.. జ‌గ‌న‌న్న రావాలి`` అని రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ కోరుకుంటున్నార‌ని,  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్క‌డ విన్నా ఇదేమాట వినిపిస్తోంద‌ని కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌ల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. ఏపీకి 15 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని ఇప్పుడు త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం ప్ర‌త్యేక హోదాను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. బాబు వంటి దుర్మార్గ ముఖ్య‌మంత్రి దేశంలో ఎక్క‌డా ఉండ‌ర‌న్నారు. తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో దేశంలో ఏ ముఖ్య‌మంత్రి సంపాదించ‌నంత సొమ్మును సంపాదించి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచార‌న్నారు.  హోదా కోసం మొద‌టి నుంచి పోరాడుతున్న‌ది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌న్నారు.  మార్చి1 అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల కార్యాల‌యాల వ‌ద్ద పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నామ‌న్నారు. ఢిల్లీలో కూడా త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నాలు చేస్తామ‌ని ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు పోరాటాలు చేస్తామ‌ని, అప్ప‌టికీ హోదా ఇవ్వ‌క‌పోతే త‌మ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీ రాజీనామా చేస్తార‌న్నారు. హోదా వ‌చ్చే వ‌ర‌కు తాము పోరాటం చేస్తామ‌ని ఎమ్మెల్యే ప్ర‌తాప్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com