Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాగోలు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 318వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
కోర్డు నోటీసులు టిడిపికి చెంపపెట్టు
ఇకనైనా వారిచేత రాజీనామాలు చేయించండి

Published on : 13-Mar-2018 | 17:36
 


పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసులు ఇవ్వవడం తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటింది. ఇకనైనా న్యాయస్థానాల్లో తీర్పుల కోసం వేచి చూడకుండా, రాజ్యాంగాన్ని, చట్టాలని గౌరవిస్తూ పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించాలని వైయస్ ఆర్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ  డిమాండ్ చేశారు.  విజయవాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని, రాజకీయాలంటే విలువలు గౌరవం పెరిగేట్లుగా టిడిపి మెలగాలని 
తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్ధతు కూడగడతాం

విభజన చట్టంలోని అన్ని అంశాలను ప్రధాన అంశమైన ప్రత్యేక  హోదా కోసం అవిశ్వాస తీర్మానం కోసం అన్ని పార్టీల ఎంపీల మద్ధతు కూడగడతామని, తమ పార్టీ ఎంపిలు రేపటి నుంచి వారిని  కలుస్తారని ఆయన వివరించారు.  తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి పట్ల అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు తాలూకా ఔన్నత్యాన్ని కాపాడాలని కోరతాం.  పార్లమెంటు సాక్షిగా  ప్రభుత్వాలు చేసిన ప్రకటనను అమలు అయేలా చూడాలని వైయస్ ఆర్ సీపీ అన్ని పార్టీల మద్ధతును కూడగొట్టే యత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి తాకట్టు పెట్టిన నేపథ్యంలో , వాటిని సాధించేందుకు తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. 

రాష్ట్రంలో అసలు పాలన ఉందా?
మంత్రులను బర్తరఫ్ చేయాలి?

గుంటూరు పట్టణం కార్పొరేషన్ కలుషిత నీటితో పదిమంది చనిపోవడం చూస్తుంటే పరిపాలన ఉందా అని అనిపిస్తోందంటూ బొత్స మండిపడ్డారు. పాలనను గాలికి వదిలేశారని స్ఫష్టం అవుతోంది. ప్రధాన కార్యదర్శి తో సహా అధికార యంత్రాంగమంతా చట్టుపక్కలే ఉంటున్నా పరిస్థితుల్లో మార్పులు  కనిపించకపోవడం లేదంటే పాలనా తీరు ఏవిధంగా తేటతెల్లం అవుతోందని ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి ఎన్నికలు జరగక పోవడంతో గుంటూరు మున్సిపాలిటిలో పాలన పడకేసిందంటూ ఎదురు విమర్శలు చేస్తున్న టిడిపి నేతలు  ,4 ఏళ్లుగా  గొడ్లుకాస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

రాజధానికి సమీపంలోని పట్టణ ప్రాంతంలోని పరిస్థితులు ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి వారి మాటలు కోటలు దాటుతున్నాయి, చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారనీ  దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

కలుషిత నీటి  సరఫరాకు కంటితుడుపు చర్యలతో సరిపుచ్చకుండా  జిల్లా మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, అసమర్ధ మంత్రులను వెంటనే తొలగించాలి. అప్పడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని బొత్స అన్నారు. ఈదుర్ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా నేటికీ  కూడా కారణాలు తెలుసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. 
ఈప్రభుత్వానికి ఎంతసేపూ ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లు, పార్టీ ఫిరాయింపులు, దొడ్డి దారిన పనులు తప్ప  ప్రజల సంక్షేమం గురించి కనుచూపు మేరలో ఆలోచించడం లేదు . ఈ తీరుతోనే విసిగి వేసారిన ప్రజలు ప్రజా సంకల్పయాత్రకు తరలి వచ్చి ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని  ఎదురు చేస్తున్నారని పేర్కొన్నారు.
Labels : YSRCP, YS Jagan, Botsa, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com