Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               తిమ్మపాలెం శివారు నుంచి 94వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం.                                చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీ మ‌న‌కొద్దు’

Published on : 13-Feb-2018 | 13:28
 


అమ‌రావ‌తి:  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఆ నాడు పార్ల‌మెంట్ త‌లుపులు మూసి మ‌రి విడ‌గొట్టారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటామ‌ని నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ సాక్ష్యంగా నిలిచింది. అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పారు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పాడు, ఆ మాట ప్రకారమే ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం అనే హామీ ఇచ్చారు, ఆ మాటలను నమ్మే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయే కూటమికి విజయాన్ని కట్టబెట్టారు. కేంద్రంలో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా హామీని గాలికి వదిలేసింది. ప్ర‌త్యేక హోదా కోసం నినాదాల హోరెత్తినా..పెడ‌చెవిన పెట్టింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్యాకేజీ తాయిళం ప్ర‌క‌టించ‌గానే సంబ‌రం అమ‌రావ‌తి అంత అయింది. ఇక హోదా మాట నీటి మూటగా మారింది. నిజంగా ప్ర‌త్యేక ప్యాకేజీ అంత ముద్దా? ప‌్ర‌త్యేక హోదా మ‌న‌కొద్దా?. ప్ర‌త్యేక హోదా వ‌దులుకుంటే..పోయేది ఏమీ లేదా?  ఆలోచించండి. 
 ప్రత్యేక హోదా వల్ల బెనిఫిట్స్..  
ప్రత్యేక హోదా అనేది మొదట మూడు రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్, జమ్ము కాశ్మీర్ లకు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఇది మరో ఎనిమది రాష్ట్రాలయిన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలకు ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా వల్ల కలిగే అతి ముఖ్యమైన లాభాలు ఏమిటంటే..

– కేంద్ర సహాయం 90: 10 నిష్పత్తిలో ఉంటుంది.
అంటే 90 శాతం గ్రాంటు రూపంలోనూ, మిగిలిన 10 శాతం అప్పు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీని వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు, రాష్ట్రాలు బయటి నుండి తెచ్చుకొనే నిధులకు కేంద్ర ప్రభుత్వమే 90 శాతం భరిస్తుందన్న మాట.
– ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలపై, ఇన్‌కం ట్యాక్స్, కార్పోరేట్ ట్యాక్స్ లపై భారీ రాయితీలు ఉన్నాయి.
దీని వలన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు భారీగా రాష్ట్రానికి తరలి వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలతో పాటు కొత్త కొత్త నైపుణ్యాలను రాష్ట్ర ప్రజలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది భావితరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంద‌న‌డంలో అతిశయోక్తిలేదు.
– రాష్ట్ర లోటు బడ్జెట్ ను తీర్చవలసి ఉంటుంది.
కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులు సమకేర్చడమే కాకుండా దీనికి సంబందించి రాష్ట్రానికి అవసరమైన వనరులను అభివృద్ధి పరిచి రాష్ట్ర లోటు బడ్జెట్ ను తగ్గుముఖం పట్టేలా కేంద్రం చేస్తుంది. ఒక రకంగా రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది.
– కేంద్రం ఇచ్చే నిధులు వెనక్కివెళ్లవు.
అంటే ఏ కారణం చేతనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయని యెడల అవి తరువాత సంవత్సరం నిధులలో కలుస్తాయి. కానీ మళ్లీ వెనక్కి వెళ్లిపోవు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజధాని లేకుండా ఏర్పడింది. కాబట్టి కేంద్ర నిధులు రాజధాని నిర్మాణానికి ఇవ్వవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదాతో రాష్ట్రం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావలసిన నిధులు, రాయితీలు ఎవరిని అడుక్కోకుండా, బ‌తిమాలకుండా వచ్చేస్తాయి.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com