Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                 
    Show Latest News
రైతు రాజ్యం కాదు.. రౌడీ రాజ్యం

Published on : 23-Nov-2017 | 15:17
 


– న్యాయం చేయాలని అడిగితే రౌడీ షీట్లు
– మంత్రులను కలిసినా దక్కని భరోసా 
– బాధిత రైతులను ఫోన్‌లో పరామర్శించిన వైయస్‌ జగన్‌
– అధికారంలోకి వచ్చాక చెల్లిస్తానని హామీ

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదని.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పుణ్యమా అని రైతులు పంటలు సరిగా పండించలేకకపోవడం సరికదా ప్రశాంతంగా బ్రతలేకపోతున్నారు. అభివృద్ధి పేరు చెప్పి రైతుల భూముల మీద కన్నేసిన చంద్రబాబు ఉన్న భూముల్లో పంటలు పండించుకుని ప్రశాతంగా బ్రతుకుదామన్నా ప్రశాంతంగా ఉండనీయడం లేదు. నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా కడుపు మండి ఆందోళనకు దిగిన రైతన్నపై రౌడీషీట్‌ తెరిచి బెదిరింపులకు దిగుతోంది. 

నకిలీ నార కారణంగా పంట నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని ఏడాదిన్నరంగా పోరాడుతున్నారు. అప్పట్లో ధర్నా కూడా చేశారు. నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించినా పరిహారం ఇచ్చే విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్నినా చెల్లింపులు జరగలేదు. కంపెనీల యజమానులు కోర్టుకెళ్లి కలెక్టర్‌ ఉత్తర్వులు కొట్టేయించుకుంటే న్యాయం చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమను కలవడానికి వచ్చిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.  నకిలీ నార విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డికి నాలుగుసార్లు, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు, గత ఏడాది అసెంబ్లీకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. అయినా తమకు న్యాయం జరక్కపోవడంతో రైతులు స్వచ్ఛందంగా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఆగ్రహించింది. తమస్యలపై నిలదీసిన రైతులపై రౌడీషీట్లు తెరిచి వేధిస్తుంది. కేసులు పెట్టి పత్రాలు రాయించుకుని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

నష్టపోయిన పంటకు పరిహారం కోసం ఏడాదిన్నరగా  ప్రభుత్వానికి రైతులు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో రైతులంతా కలిసి ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి.. తమ సమస్యలను చెప్పుకునేందుకు విజయవాడ తరలి వచ్చారు. న్యాయం కోసం నినదించిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ప్రతాపం చూపించింది. పోలీసు బలాన్ని ప్రయోగించింది. మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించింది. మనస్తాపానికి గురైన అన్నదాతలు పోలీస్‌స్టేషన్‌లోనే ఆందోళన చేపట్టారు. ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.

పంట నష్టం జరిగినందుకు పరిహారం కోరుతున్న రైతులపై వేధింపులు ఎక్కువయ్యాయి. బుధవారం పోలీసు స్టేషన్‌లోనే పురుగు మందు తాగిన ముగ్గురు రైతుల్లో పూర్ణయ్య అనే రైతుపై పోలీసులు 13 కేసులు పెట్టారు. అంతే కాకుండా ఇతనిపై గంపలగూడెం పోలీసులు రౌడీషీట్‌ కూడా తెరిచారు. పెనుగొలను గ్రామంలో 41మంది రైతుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ధర్నాలకు దూరంగా ఉంటామని హామీ పత్రాలు రాయించుకున్నారు. పరిహారం కోసం పోరాడుతున్న 56 మంది రైతులపై కూడా పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టడంతో తిరువూరు కోర్టు చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు వైయస్‌ జగన్‌ భరోసా
ఆత్మహత్యాయత్నం చేసిన రైతులను ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పరామర్శించారు. నకిలీ విత్తనాలు, నారు వలన నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు దక్కాల్సిన రూ. 91 వేలను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. 2.30 కోట్లు తక్షణం చెల్లిస్తానని అన్నారు. రైతుల సమస్యలపై మంత్రుల నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com