Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉండూరు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 219వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్‌: వైయ‌స్ జ‌గ‌న్‌                               పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం

Published on : 12-Oct-2017 | 17:44
 

హైదరాబాద్ః రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై  వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన్న చంద్రబాబు...వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో లక్ష 43వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టడం వల్లే ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయన్నారు.  నిరుద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దని, విలువైన జీవితాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.  కలిసికట్టుగా పోరాడి రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకుందామని, మంచి రోజు కోసం వేచిచూద్దామని కోరుతూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com