Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                               పి.గ‌న్న‌వ‌రం నుంచి 193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు: జోగి ర‌మేష్‌                               లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
మాయ కుండలో నారా తలకాయ

Published on : 10-Nov-2017 | 13:03
 

అమరావతిలో తాను బలవంతంగా పోగొట్టుకున్న పొలం గట్టుపై దిగాలుగా కూర్చున్నాడు ఒక రైతు. ఏటా నాలుగు పంటలు పండే భూమి కళ్లముందే బీడుగా పడి ఉంటే అతని గుండె తరుక్కుపోయింది. అలాగే ఆ నేల వంక చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచాడు. చేసేది లేక భారంగా అక్కడినుంచి కదిలాడు. నాలుగు అడుగులు వేసిన తర్వాత అతని కాలికేదో గట్టిగా తగిలిన శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఏదో గుండ్రని అంచు కనిపించింది. వెంటనే చుట్టూ ఉన్న మట్టిని పెకిలించి చూశాడు. ఒక మట్టి కుండ అని గుర్తించి, గంజి కాసుకోడానికైనా పనికొస్తుందని జాగ్రత్తగా పైకి తీశాడు. అలా తీస్తున్న సమయంలో తన పై జేబులో ఉన్న రూపాయి కాసు ఒకటి కుండలో పడింది. ఆ రైతు తన రూపాయిని తీసుకుందామని కుండలో చెయ్యిపెట్టి చూసేసరికి అతని చేతికి పది రూపాయి కాయిన్లు వచ్చాయి. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆకాశంవైపు కృతజ్ఞతగా చూశాడు. తన కష్టాన్ని చూడలేక కుండ రూపంలో తనకొక వరం ప్రసాదించిందని భూదేవికి రెండుచేతులా మొక్కాడు. ఆ కుండను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి ఒక చోట భద్రపరచాడు. తన బతుకు తెరువుకి అవసరమైనప్పుడల్లా ఆకుండ సహాయంతో తన దగ్గర ఉన్న ప్రతి దాన్ని పదింతలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా బతకసాగాడు. ఉన్న భూమంతా పోయి, సర్కారు చేతిలోమోసపోయి, తినడానికి తిండికూడా కష్టమైపోయి, పిల్లల చదువులు ఆగిపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతు జీవితం ఒక్కసారిగా మళ్లీ ఆనందంగా మారిందనే విషయం ఊరంతా తెలిసింది. కానీ ఇదంతా ఎలా జరిగిందబ్బా అనే విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం ఆనోటా ఈనోటా భ్రమరావతి సృష్టికర్త బాబుగారికి తెలిసింది. తన పాలనలో కష్టాలు, కన్నీళ్లలో మునిగితేలాల్సిన రైతు మళ్లీ ఇలా సంతోషంలో ఎలా ఉన్నాడు? ఏదో జరిగింది? ఎవరో ఏదో చేశారు? అనే సందేహం బాబుగారిని పీక్కుతినేసింది. మొత్తానికి ఆ రైతును కబురుపెట్టి విషయం రాబట్టి భూమిని లాక్కున్నట్టే బలవంతంగా ఆ కుండను కూడా లాగేసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏం జరుగుతుందో చెప్పి బెదిరించి పంపించేశాడు. 

బాబుగారు కుండను చూస్తూ చాలా చాలా ఆలోచించాడు. తొలిసారిగా ఈ కుండలో ఏం వేస్తే మంచిదో తేల్చుకోలేక సతమతమైపోతున్నాడు. డబ్బు… దోచుకున్నంత ఉంది. ఇందులో వేస్తే మళ్లీ దాచుకోవడం కష్టం. బంగారం, అబ్బా తరాలకు సరిపడా ఉంది. హామీలు… పోయిన ఎన్నికల్లో ఇచ్చినవన్నీ అలాగే మిగిలిపోయాయి. కొత్తగా వచ్చే ఎన్నికలకు సరిపడా ఉన్నాయి. వద్దులే అనుకున్నాడు. అంతలో బాబుగారి మొద్దబ్బాయి మిస్టర్ దాల్ అక్కడకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఒక బృహత్తరమైన ఐడియా ఇచ్చాడు. కుండలో ఏదైనా వేసే ముందు, అసలు వేసింది పదింతలు ఎందుకు అవుతుందో? కుండలో అసలు ఏముందో? చూస్తే పోలా నాన్నారూ అన్నాడు. ఆ ఆలోచన విన్న వెంటనే సీనియర్ నారా ఆనందం తట్టుకోలేక కొడుకును కౌగిలించుకున్నాడు. పుత్రోత్సాహంతో ఆనందభాష్సాలు కార్చాడు. కుండ ముందు కూర్చుని చాలా జాగ్రత్తగా అందులో తన తల దూర్చాడు. అంతే క్షణాల్లో బాబు తల పది తలలైంది. బెంబేలెత్తిపోయిన బాబు ఏం చెయ్యాలో తెలియక అటూ ఇటూ పరిగెత్తాడు. చినబాబు మాత్రం  అమితానందంతో వికటాట్టహాసం చేస్తూ ఇలా అన్నాడు. నాన్నారూ సాధించారు. ఇక మీకు తిరుగులేదు. అన్నాడు. అర్థంకానట్టు చూశాడు సీనియర్ బాబు. ఇప్పటిదాకా మీకు ఒక తలకాయ రెండు నాల్కలు. ఇకపై మీకు పదితలలు ఇరవై నాల్కలు. ఎన్ని హామీలు ఇవ్వొచ్చో… ఎన్ని అబద్ధాలు ఆడచ్చో కదా! భలే భలే అని చిందులేస్తూ వెళ్లిపోయాడు చినబాబు. చంద్రబాబు అయోమయంతో తలలు పట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com