Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలిః వైవీ సుబ్బారెడ్డి                               తెలుగు ప్రజలందరికీ వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు                               ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారుః వైయస్ జగన్                               ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలిః వైయస్ జగన్                               పంటలు కుళ్లిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడుః వైయస్ జగన్                               అనంతపురం జిల్లా సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైయస్ జగన్                               వైయస్ జగన్ పాదయాత్రలో బాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తారుః పార్థసారధి                               బాబుకు రాజ్యాంగంపై గౌరవం లేదుః పార్థసారధి                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః జోగి రమేష్                  
    Show Latest News
జెసి పొలిటికల్ ప్లాన్

Published on : 23-Sep-2017 | 11:16
 

అయ్యా నమస్తే…నా పేరు నర్సారెడ్డి. అనంతపురం జిల్లా వాడిని. ఇగో మా ఎమ్ పి జెసి దివాకర్ రెడ్డి రాజీనామా సంగతి ఇని మీకో ఇషయం ఇవరంగా సెప్దావని వచ్నా. అయ్యో నా అనంత పురం ప్రజలు, నా తాడిపత్రి జనం అని గగ్గోలు పెడతా ఉండాడు మా జెసి. సాగునీరుల్యా, తాగునీరుల్యా ఆఖరికి రోడ్లు ల్యా…ఎలాగబ్బా నా జనేలు బతికేటిదంటూ నెత్తి మీద సుత్తేస్కు కొట్టుకుంటాన్నాడు. అరె గా పొద్దు విజయ్ నగర్ కాలని మ్యాటర్లా గూడా నా మాట సెల్లనందుకే ఇగో రాజీనామా ఇడిచేస్తన్నా…నాకు ఆ స్పీకరమ్మ దొర్కలేదు..దొర్కగానే ఇచ్చేస్తా అని చెబుతుండే…ఇదంతా జూసి అనంతపురమోళ్లు…అయ్యో సామీ అట్టా సేయద్దు అని పడి ఏడుత్తారనుకుంట్నడా ఏమి…ఏమి ల్యా… పోనాయనా చల్లంగ పోయిరా అనుకుంటున్నరు. 

ఏంటది దుష్టశక్తులు అడ్డం పడతన్నయ్యా…ఎక్కడివయ్యా…మీరు పుట్టించినయ్ గావు ఆ శక్తులు..నువ్వు, ఆ చంద్రబాబు…మిమ్మల్ని మించిన దుస్టశత్తులుంటాయా ఈ రాష్ట్రంలో. కూలినాలి జేసుకునే జనాల్ని అప్పుడు నువ్వు, నీ తాలూకు నాయకులొచ్చి ఖాళీ జాగాలో ఇళ్లేస్కోండి…పట్టాలిప్పిస్తాం అని చెబితే గదా…పాపం ఆ ఇజయనగరం కాలనీలో బక్కోళ్లు అప్పులు సొప్పుల సేసి దుడ్లు బెట్టుకుని కొంపలు గట్టుకున్నారు. ఇప్పుడేమో మీరు మీరు గుమ్ములాడుకుని, ఆ పేదోళ్ల గుడెసెలు గలాట జేసినారు. ఛీ…ఛీ…

అంతకు ముందు ఆ పరిటాల సునీతమ్మని నమ్మి గూడా కొందరు పేదోళ్లు కొంప గూడు లేకుండా అయిపోయుండ్లే…అదే కక్కల పల్లిలో…రాప్తాడు ఎమ్మెల్యేమ్మగారు, ఆమెగారి సుపుత్రుడూ..ఇంకా ఆళ్ల తాలూకోళ్లే ఆళ్లని ఎల్లగొట్టిచ్చినారు. అయినా తెలీకడుగుతాను…అసలు ప్రభుత్వ జాగాలో జనాలు పాగా ఏస్తున్నారే అనుకో ఈ మున్సిపాలిటీ వాళ్లు అప్పుడు ఏం చేస్తున్నట్టు? పన్నులు కట్టించుకుని, కరెంటు కనెక్షన్లు ఇచ్చి, ఇప్పుడొచ్చి ఇల్లు కూల్చేయడం ఏం న్నాయం..?

సరి అసలు విసయం చెబుతాను చూడండి. మా తాడిపత్రిలో జెసి అంటేనే జనాలు చుర్రున తాచుపాములెక్క లేస్తున్నారు. ఓహో బోలెడన్ని కబుర్లు చెప్పి జనాలని బురిడీలు కొట్టించిది చాలు పొమ్మంటున్నారు. అందుకే వచ్చే ఎలక్షన్లో సింపతీ కోసం ఇప్పుడీ రాజీనామా డ్రామా మొదలేసినాడు. రాబోయే ఎన్నికల్లో ఆయన సుపుత్రుడు పవన్ రెడ్డికి సీటు ఇప్పించుకోని, జనం కోసం పదవిని వదిలేసాడన్న సింపతీని అడ్డేసుకోని మళ్లీ పీటం ఎక్కేదామని ప్లానులేస్తన్నాడు. ఇగో చెబుతున్నా అనతపురం ఓళ్లు అంత వెర్రోళ్లు గాదు జేసీ… ఏసాలు ఇక మానేసి…నువు సెప్పావుగా ఓ నాలుగెకరాలుందని ఎళ్లి ఆ చెట్టుకిందే తొంగో…ఒక్కా మాట నువ్వన్నదైతే నిజమప్పా నువ్వో ఫెయిల్యూర్ ఎమ్.పి వి.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com