Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
మార్చి నుంచి ‘హోదా’ కోసం మార్చ్‌

Published on : 13-Feb-2018 | 15:33
 

– ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు నినాదం 
– రాష్ట్రం, ఢిల్లీలో పోరాటాలకు కార్యాచరణ
– ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం.. హోదా సాధనే లక్ష్యం

‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు’ అంటూ వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఒకవైపు ప్రజా సంకల్పయాత్రలో ప్రజలతో మమేకం అవుతూనే ఎప్పటికప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాలను పరిశీలించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మార్చి 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదురుగా ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహిస్తారు. మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరగనున్న ధర్నాలో పార్టీ నాయకులు పాల్గొంటారు. దీనిని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న ప్రాంతం నుంచే ప్రారంభిస్తారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధన కోసం అనే ఉద్యమాలు, ఆమరణ దీక్షలు, యువభేరీలు నిర్వహించిన జగన్‌మోహనుడు హోదా అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు మరో ముందడుగు వేశారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా డిమాండ్‌పై నోరు మెదపకుండా.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన హామీలపై ప్రశ్నించకుండా నాలుగేళ్లుగా ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రత్యేక హోదా వలన ఏపీకి కలిగే ప్రయోజనాలపై యువభేరీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించిన వైయస్‌ జగన్‌.. ఈసారి ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. 
నాలుగేళ్లుగా నోరెత్తని చంద్రబాబు..
నాలుగేళ్లుగా ఏపీకి జరిగిన అన్యాయంపై నోరు మెదపని చంద్రబాబు అండ్‌ కో.. ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారు. తమ నాయకులతో బీజేపీని రెండు రోజులు తిట్టించడం.. కేంద్ర మంత్రులను ఢిల్లీకి పంపి చర్చల పేరుతో కలిసొచ్చి పేపర్‌కు పెయిడ్‌ వార్తలు రాయించడం. ఆనక బీజేపీ నాయకులను మందలిస్తున్నట్టు మీడియాకు లీకులివ్వడం. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు పార్లమెంట్‌లో కెమెరాల ముందు హడావుడి చేయడం తప్పించి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టి 13 రోజులవుతున్నా ఇప్పటికీ చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. కేవలం పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి హడావుడి చేయడం తప్పించి ఆయన స్వయంగా మాట్లాడింది లేదు. కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విడ్డూరం. మరోవైపు ఇంత జరుగుతున్నా పెట్టుబడుల కోసమంటూ దుబాయ్‌కి పారిపోవడం తెలుగు ప్రజలందర్నీ ఆవేదనకు గురిచేసింది. 
డిమాండ్‌లో స్పష్టతేదీ..?
ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని హడావుడి చేస్తున్నారు తప్పించి ఏం న్యాయం కావాలో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిన్న మొన్నటిదాకా పలు సందర్బాల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చారు. ఏపీకి చాలా తెచ్చాం.. అందరికన్నా మనకే ఇచ్చారు. లాంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా సైతం ఇప్పటికే కేంద్రం అన్నీ ఇచ్చింది.. ఇంతకు మించి అడగలేం.. వంటి స్టేట్‌ మెంట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కేంద్రమీద దుమ్మెత్తిపోయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తన అసమర్థతను కేంద్రం మీదకు నెట్టేసి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు పలుమార్లు పరస్పర విరుద్ద ప్రకటనలు చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు అడిగి.. ఇప్పుడు ప్యాకేజీతో సరిపెట్టుకుందాని చెప్పడం ఏపీ ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది. 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com