Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               తిమ్మపాలెం శివారు నుంచి 94వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం.                                చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
క‌ద‌లండి..క‌దిలించండి
- ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు మ‌రో ఉద్య‌మం

Published on : 13-Feb-2018 | 13:45
 -  మార్చి 1న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నా
- మార్చి 5న జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా  
 - ఉద్య‌మంపై దిశా నిర్దేశం చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: మ‌న ఆశా..మ‌న శ్వాస ప్ర‌త్యేక హోదా కావాలి. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎందాకైనా పోరాడుదాం. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా నిన‌దిద్దాం. అవును నిజం..ప్ర‌త్యేక హోదా మ‌న హ‌క్కు..ఆ దిశ‌లో మొద‌టి నుంచి క‌దం తొక్కుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రింత‌గా స‌మ‌రోత్సాహాన్ని ప్ర‌క‌టిస్తోంది. కార్యాచ‌ర‌ణ‌కు పూనుకుంటోంది. ప్ర‌జ‌లంద‌రి కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు పెట్టే వ్య‌వ‌హ‌రాలను తిప్పికొట్టే దిశ‌లో మ‌రో పోరాటానికి సిద్ధ‌మైంది. ప్ర‌త్యేక హోదా మ‌న హ‌క్కు..ప్యాకేజీ మ‌న‌కొద్దు అంటూ ఢిల్లీ జంత‌ర్  మంత‌ర్ దాకా వెలుగెత్తి చాటేందుకు క‌దులుతోంది. క‌ద‌లండి..క‌దిలించండి..పెను నిద్ద‌ర వ‌దిలించండి..అంటూ వ‌స్తున్నాయ్‌..వ‌స్తున్నాయ్‌..జ‌గ‌న్నాథ ర‌థ చ‌క్రాలు వ‌స్తున్నాయ్‌. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ ఏం చెప్పారు.

ప్రత్యేకహోదా మన హక్కు: వైయ‌స్‌ జగన్‌
రాష్ట్రాన్ని విభజించేటపుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని వైయ‌స్‌ జగన్ స్పష్టం చేశారు. ఆ హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అన్ని దశల్లోనూ రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్ట సవరణ కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే చాలని, అందుకే గట్టిగా పోరాడాలని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. హోదా కన్నా ప్యాకేజీయే మెరుగైందని చంద్రబాబు చెప్పడం పూర్తిగా తప్పని, హోదాకు ప్రత్యామ్నా యం మరేదీ లేదని ధ్వ‌జ‌మెత్తారు.  హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని, మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావాల న్నా అదొక్కటే మార్గమని చెప్పారు. ‘‘ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయని రగడ చేస్తున్నాయి. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేద‌న్నారు. మనం మొదట్నుంచీ హోదా కావాలని డిమాండ్‌ చేస్తున్నాం. మన వైఖరిలో మార్పేమీ లేదు.  పోరాటం మొదలు పెట్టింది మనమే, తుదికంటా పోరాడి సాధించేదీ మనమే’’ అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

ధ‌ర్నాలు విజ‌య‌వంతం చేద్దాం
ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూట్ మ్యాప్ రూపొందించారు.  ‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని, అదే విధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజైన మార్చి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ‘ప్రత్యేక హోదా మనహక్కు– ప్యాకేజీ మనకొద్దు’ అనే నినాదంతో ధర్నాను నిర్వహించాలని పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ధ‌ర్నాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జ‌న‌నేత పిలుపునిచ్చారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com