Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
బాబుగోరి ఓటు రాజకీయం

Published on : 23-Jun-2017 | 12:06
 

నారా సెందరబాబునాయుడిగోరి లెక్కే వేరు.
ఏం మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేత్తారు.
నాన్చుడు గీన్చుడు ఉండదురా బాబూ.
కర్నూలులో సెందరబాబుగోరేమన్నారో తెలుసా?
తెలకపోతే వినెహె. మీరంతా  ఎంత గింజుకున్నా..రేపొద్దున్న ఎలచ్చన్లు వస్తే మీ ఓటు మాత్రం నాకే ఎయ్యాలిరా నాయనలారా అని పెజానీకానికి  చెప్పారాయన.
ఎలచ్చన్లంటే ఓటుకి ఇంత అని  డబ్బులు ఇత్తున్నారు కదా.
"నాను తలుచుకుంటే ఒక్కో ఓటుకు  అయిదే వేలు  కూడా ఇచ్చీగలను..కానీ ఇయ్యను..అసలు మీకు డబ్బులెందుకియ్యాలిరా  బాబూ.. ఇప్పటికే పెజలకి చాలా సేవలు చేశా..మొహం మొత్తేలా అబివృద్ధి  చేశా.. పింఛన్లు ఇచ్చా...రోడ్డు వేయించా..రుణమాఫీ చేశా..ఇంకేటి చెయ్యాలిరా బాబూ.. మరంచేత మీరంతా నంద్యాల ఎన్నికలొచ్చినపుడు  నాకే ఓటెయ్యాలి" అని సెందరబాబు   బల్లగుద్ది మరీ చెప్పారున.
నిజవే. ఓటుకి అయిదు వేలు ఇవ్వడం ఆయనకేమన్నా ఓ లెక్కా.?
ఓటుకి అయిదే వేలేంటే అవసరమైతే లచ్చలు ఇవ్వగలరు. స్టీఫెన్ సన్  గోరి ఒక్క ఓటుకోసమే.. కోట్లు ఇవ్వడానికి సిద్దపడిన కలేజా మా సెందరబాబుది. అటువంటిది అయిదువేలు నెక్కగాదు. అవసరమైతే పది వేలు కూడా ఇవ్వగలడు. కానీ ఇవ్వరు. మూడేళ్లుగా సెందరబాబుగోరు చాలా చేశారు. అయి చూసి అందరూ ఓటు గుద్దేయాలంతే. ఆయన వల్ల నాబం పొందిన వారంతా ఆయనకే ఓటెయ్యాలి.
వేరే పార్టీవోల్లు డబ్బులిచ్చారనుకోండి..వాటిని జోబిలో కుక్కేసుకుని..ఓటు మాత్తరం సెందరబాబుగోరి పార్టీకే ఎయ్యాలంటే. ఎంతమంచిగ చెప్పాడోకదా.
ఆయన గోరు మంచోరు కాబట్టి ఇంతవరకే చెప్పారు.
నానయితే ఇంకోటి కూడా సెబుదును.  రేపొచ్చే ఎన్నికల్లో సెందరబాబుగోరికిఓటు వెయ్యని వారి జాబితా  తయారు చేసి..అందులో ఉన్న వారికి ప్రెబుత్వం నుంచి ఇచ్చే పథకాలు ఇవ్వకుండా ఆపేయాలంతే. అవసరమైతే  ఓటు వేయని వారిని మక్కెలిరగొట్టి..బొక్కలోకి తోసి..కోరుట్లు చెప్పినా కూడా విడుదల చేయకుండా చీకట్లో పెట్టి కుమ్మి పారేయాలి. అలా చేత్తే కానీ  ఎదవ జెనానికి బుద్ధిరాదు.
ఓటు వెయ్యని వారి ఇళ్లకు మంచినీళ్లు బందు చేయాలి.
రేషన్ కార్డు కేన్సిల్ చేయాలి.
అంతెందుకు ఆధార్  కార్డు.. పాస్ పోర్టు కూడా రద్దు సేసేయాలి.
కరెంట్ సరఫరా బందు చేయాలి.
అంత స్టిక్టుగా ఉంటే కానీ  జెనం దారికి రారెహె.
సివరాకరిగా సెప్పేదేంటంటే.. ఏ ఎన్నిక వచ్చినా సరే  నోర్మూసుకుని.. బాబుగోరి పార్టీకి ఓటు గుద్దెయ్యండి. నేకపోతే మీ పిలక పీకించేసి అండమాన్ జైలుకు తన్నుకుపోతారు. ఏమనుకుంటున్నారో ఏంటో.
కవికాకి
----------------------

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com