Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               పేరవరం నుంచి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం                               చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్ల రూపాయలు మింగేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               మహానేత వైయ‌స్ఆర్‌ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు 90 శాతం పూర్తికావడం నిజం కాదా? : వైయ‌స్ జ‌గ‌న్‌                               ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               అశేష జ‌న‌వాహినిని న‌డుమ గోదావ‌రి బ్రిడ్జిపై కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               పోల‌వ‌రం ప్రాజెక్టు దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                 
    Show Latest News
బిల్ గేట్స్ కోసం బాబు వేషం

Published on : 06-Oct-2017 | 11:52
 

విశాఖ సముద్రతీరం. చంద్రబాబు దగ్గరుండి సాగరతీరాన్ని ట్రాక్టర్లతో దున్నిస్తున్నాడు. బీచ్ రోడ్డు కి రెండు వైపులా ఉన్న ఫుట్ పాత్ కూడా గునపాలతో పెకిలిస్తున్నారు. అక్కడున్న షాపుల వాళ్లకి కొన్ని ఇనస్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరో పక్క పూలు, పండ్ల మొక్కలు, నారుమళ్లు తెచ్చిన పెద్దపెద్ద లారీలు వరసగా వచ్చి ఆగుతున్నాయి. కూలీలు హడావిడిగా వాటిని కిందకు దించుతున్నారు. ఆ వెనకే వాటర్ టాంకర్లు వచ్చాయి. గబగబా ఆ మొక్కలు అక్కడ నాటండి. టాంకర్లతో నీళ్లు పోయండి. ఎరువులేసి తెల్లారేలోగా కాపుకాసేలా చూడండి. లేకపోతే కొన్ని పళ్లు తెచ్చి చెట్లకు దారాలతో వేళ్లాడగట్టండి. త్వరగా పూర్తి కావాలి. రేపటికల్లా అంతా రెడీ కావాలి. విశాఖలో ఎటువైపు తిరిగి చూసినా పొలమో, తోటో కనపడాలి సీరియస్ గా చెబుతున్నాడు బాబు. విశాఖ ప్రజలకు ప్రత్యేకంగా ఒక ప్రకటన వెలువడింది. ప్రతి ఇంటి డాబామీదా, ప్రతి అపార్టుమెంట్ టెర్రస్ మీద చెరుకు తోటలు పెంచాలని. అదీ యమా అర్జంటుగా…ఏం  చేసైనా సరే ఆరడుగుల కంటే ఎత్తుగా ఏపుగా చెరుకు తోట కనపడాలి అని. అలాగే ప్రతి ఇంటి ముందు వరి నారు ఉండాలని. కనీసం మొక్కజొన్న చేనైనా కనపడాలి అని. మత్స్యకారులందరూ చేపల వేట మానేసి తీరంలో నాట్లు వేయాలని. బీచ్ కి వచ్చిన పర్యాటకులను పిలిచి గుప్పెడు విత్తనాలిచ్చి చల్లమని. ఇలా చాలా చాలా చేయించాడు చంద్రబాబు దగ్గరుండి. పగలు, రాత్రీ కష్టపడి బాబు చెప్పిన పనులన్నీ చేసారు.

ఆరోజు రానే వచ్చింది. విశాఖ సాగరతీరంలో పెద్ద సభ కొలువు తీరింది. చుట్టూ అరటి, మునగ, జామ, సపోట, మామిడి చెట్లు కుండీల్లో అందంగా అరేంజ్ చేసిపెట్టారు. దారి పొడవునా కొబ్బరి చెట్లు కర్రలకు కట్టి నిలబెట్టి ఉన్నాయి. చివరకు వేదిక మీదకూడా పూల మొక్కలు, బోన్సాయ్ లు అలంకరించారు. ప్రజలంతా ఆతృతగా వేదిక వైపు చూస్తున్నారు. ఈలోగా పైనించి హెలికాఫ్టర్ సౌండ్ వినిపించింది. ఛాపర్ లో చంద్రబాబు పక్కనే బిల్ గేట్స్ ఉన్నారు. పైనుంచే కిందున్న ప్రజలకు చేయి ఊపాడు బాబు. వెళ్లిపోమంటున్నారేమో అనుకుని వేదిక దగ్గరనుంచి జనాలంతా వెనుతిరగబోయారు. టిడిపి అనుచరులు, ప్రభుత్వాధికారులు వాళ్లని ఆపారు. బిల్ గేట్స్ కి విశాఖ మొత్తాన్ని ఏరియల్ వ్యూలో చూపించి వేదిక దగ్గరకు వస్తారని సర్ది చెప్పి కూర్చోబెట్టారు. హెలికాఫ్టర్ విశాఖలో చక్కర్లు కొట్టడానికి బయలుదేరింది. సీతమ్మధార, గాజువాక, జగదాంబా సెంటర్, వాల్తేరు, సిరిపురం జంక్షన్, పూర్ణా మార్కెట్, కైలాసగిరి, ఆర్ కె బీచ్, రుషికొండ బీచ్ ఇలా ఎక్కడ చూసినా ఆకుపచ్చగా కనిపిస్తోంది. చివరికి డాబాల మీద కూడా పచ్చని టోపీలు కనబడుతున్నాయి. అవన్నీ చూసి బోలెడు హాశ్చర్యపడిపోయాడు బిల్ గేట్స్. చివరకు హెలికాఫర్ట్ దిగి వేదిక మీదకు వచ్చారు అందరూ. 

వ్యవసాయంలో ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాలి. అందుకు మీ సహాయం కావాలి అన్నాడు చంద్రబాబు బిల్ గేట్సుతో. బిల్ గేట్స్ మైకు ముందుకొచ్చాడు. వ్యవసాయం అంటే దండగ అని మీరు అన్నారని నేను విన్నాను. కాని విశాఖపట్నం చూస్తే అలా అనిపించటం లేదు అన్నాడు. బుట్టలో పడ్డాడు అనుకున్నాడు బాబు మనసులో. ఎక్కడ చూసినా పంట పొలంలాగా, పండ్ల తోటలాగా, పూల వనంలాగే కనిపిస్తోంది చెప్పాడు బిల్ గేట్స్. ఈజీగా లక్షకోట్లు పెట్టుబడి పేరుతో గుంజేయచ్చు..ఆనందపడ్డాడు బాబు. ఉప్పునీటితో కూడా ఇంత చక్కని పంటలు పండిచే మీకు ప్రపంచ సాంకేతికతో పనే లేదు. అలాంటప్పుడు నా సహాయంతో మీకేం అవసరం ఉంటుంది చెప్పండి…? అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు బిల్గేట్స్. చంద్రబాబు నోరు వెళ్లబెట్టాడు. ఇంతలో పెట్టుబడిగా అదే మొక్కుబడిగా పెట్టిన కుండమొక్కలు, దొంగ చెట్లు, పారలు, గునపాలు పట్టుకుని వేదికవైపు వస్తూ కనిపించారు జనం. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com