Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కుట్ర చేస్తున్నాడుః అంబటి రాంబాబు                               ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయంః అంబటి రాంబాబు                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః వాసిరెడ్డి పద్మ                               భవిష్యత్తులో బాబు జైలుకెళ్లడం ఖాయంః వైయస్సార్సీపీ నేతలు                               అవినీతి అంటేనే చంద్రబాబు నాయుడు..రూ.2లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               జాతీయ పార్టీలు హోదా గురించి మాట్లాడేలా చేద్దాంః వైయస్ జగన్                               చంద్రబాబు,వెంకయ్యనాయుడులు ఇద్దరూ ఐదుకోట్లమందికి వెన్నుపోటు పొడిచారుః వైయస్ జగన్                               తెలుగుదేశం పార్టీని బాబు తెలుగుద్రోహుల పార్టీగా మార్చాడుః వైయస్ జగన్                               హోదా కోసం ధర్నా చేస్తే పిల్లలని కూడా చూడకుండా పీడీయాక్ట్ పెట్టాలని బాబు ఆదేశాలు జారీ చేస్తున్నాడుః వైయస్ జగన్                 
    Show Latest News
బాబు గారి ఈ పాలన

Published on : 10-Jan-2017 | 17:23
Share    

ఈ పాలనపై జాతీయ సదస్సు ప్రారంభమైంది
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇంతకాలం ఎబిసిడి పాలనే వుండేది. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక ఈ పాలన ప్రారంభమైంది. ఎం అంటే అవినీతి, బి అంటే బ్యూరోక్రసి, సి ఫర్ కరప్షన్, డి ఫర్ డెమొక్రసి, ఇప్పుడు ఈ పాలన అంటే ఇంటర్నెట్ పాలన. నెట్ వుంటే చాలు రైతులకి అన్నం, ఇళ్లకి సున్నం, దొంగలకి కన్నం వాటంతట అవే వచ్చేస్తాయి. నెట్ లేకపోతే బతుకు చిన్నాభిన్నం. మోదీ వచ్చాక మనం ప్రపంచంతోనే ఢీ. కాంగ్రెస్ అంటే కరప్షన్ కి అడ్రస్. క్యాష్ లెస్, ఏజ్ లెస్, సెన్స్ లెస్, మెర్సిలెస్ పాలనని అందించడమే మా లక్ష్యం అని తనశైలిలో అర్థం పర్థం లేని ప్రాసలు వాడేశాడు. 
తరువాత చంద్రబాబు మైక్ తీసుకున్నాడు
                            మీకందరికీ తెలుసు. ఈ రకంగా మనం ముందుకు పోతున్నామని. గతంలో ఏ రకంగా కూడా ముందరకి పోయేవాళ్లు కాదు. ఇ అనే అక్షరానికి ఇంగ్లీష్ లో చాలా ఇంపార్టెన్స్ వుంది. ఒకప్పుడు మనల్ని ఇంగ్లండ్ పాలించింది. ఈస్ట్ ఇండియా పేరుతో మన దేశానికొచ్చి మనకి ఇంగ్లీష్ నేర్పించి వెళ్లారు. బ్రిటీష్ వాళ్లు మనకి ఇంగ్లీష్ నేర్పించిన విధంగా నేను మీకు ఇ సేవలు నేర్పించాను. అసలు ఇంటర్ నెట్ ని మొదట గుర్తుపట్టింది నేనే. నెట్ లేకపోతే మనకి నెట్ ప్రాఫిట్ లేదు. ప్రాఫిట్ లేకపోతే ఈ పార్టీనే లేదు.
                                      గూగుల్ సెర్చ్ లో వెతికి కొత్తకొత్త దేశాల్ని కనిపెట్టి పర్యటనలు చేసి అమరావతి నిర్మాణానికి సహకారం తీసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా శ్రీలంక కూడా ముందుకొచ్చింది. గతంలో సింగపూర్, మలేసియా, థాయి లాండ్, న్యూజిలాండ్ అన్నీ ముందుకొచ్చాయి. ఆ విధంగా మనం ముందుకి వెళుతున్నాం. 

                                   శ్రీలంక ప్రత్యేకత ఏమంటే అది బౌద్ధదేశం. అమరావతి ఒకప్పుడు బౌద్ధనగరం. ఈ సామీప్యం వల్ల మనం ఇచ్చిపుచ్చుకుంటున్నాం. పుచ్చుకుంటున్నాం అంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఇచ్చే చోట ఇచ్చి పుచ్చే చోట పుచ్చుకోవాలి. ప్రజాస్వామ్యం అందుకే పుచ్చిపోయింది. 

                              మీకందరికీ విజ్ఞప్తి ఏమంటే అమరావతిని నేను ఎలా నిర్మిస్తానంటే ఎలా నిర్మిస్తానో నాకే తెలియదు. రెండున్నరేళ్ల నుంచి డిజైన్లు ప్లాన్లు గీస్తున్నాం. మన గీత బాగుంటే అది ఎప్పటికైనా పూర్తవుతుంది. ఈ లోగా జనం నుంచి భూసేకరణ చేసి ఆధునుకీకరణ చేపడుతాం. జనం పాపర్ పడితేనే రాష్ట్రం సూపర్ గా వుటుంది అని ముగించాడు. 
                                          వెంకయ్యనాయుడు మళ్లీ మైక్ తీసుకొని బాబు, రుబాబ్, కబాబ్, నవాబ్ ఒకటే. జనం, మనం, గణం, గళం, యుగళం చివరకి మంగళం అని  వందన సమర్పణ లేపాడు

"ఏంటీ వీళ్లు మాట్లాడేది వీళ్లకే అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే మాటలు ఒకటి కూడా మాట్లాడరు. ఇదంతా విన్న సామాన్యుడు గొణుక్కున్నాడు 
                   

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com