Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కొయ్యాన‌పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్‌ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 295వ రోజు సాలూరు నియోజకవర్గం, పాయకపాడు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                                వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉంది.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది                               కత్తి మెడపై తగిలి ఉంటే వైయ‌స్‌ జగన్‌ ప్రాణాలే పోయి ఉండేవి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది ఆందోళన                  
    Show Latest News
బేడ బుడగ జంగాలకు న్యాయం చేస్తాం
వైయస్‌ జగన్‌ హామీ

Published on : 20-Jun-2018 | 15:12
 



తూర్పు గోదావరి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే బేడ బుడగ జంగాల కులస్తులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 194వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన బేడ బుడగ జంగాల కులస్తులు రాజోలి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ కులాన్ని ప్రభుత్వంఇంతవరకు గుర్తించడం లేదన్నారు. పిల్లలను బడిలో చేర్పించాలంటే ఏ కులమని అడుగుతున్నారని, తమకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్ట చేత పట్టుకొని ఊరురా తిరుగుతున్నామని, తమ పిల్లల భవిష్యత్‌ కోసం కృషి చేయాలని బేడ బుడగ జంగాల సంఘం నాయకుడు నరసింహులు, తదితరులు వైయస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత భరోసా కల్పించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక బేడ బుడగ జంగాల కులస్తులను గుర్తిస్తామని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com