Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
అప్పోత్సవం

Published on : 28-Dec-2017 | 12:42
 

రోజుకో పండుగ పూటకో ఉత్సవం ఆనందంగా ఉండండి అన్నాడు చంద్రబాబు. అవునౌను. నేటి విశాఖ పరిస్థితి ఇలాగే అఘోరించింది. పనికిరాని పండగలు, అప్పుల్లో ఉత్సవాలు అన్నాడో పెద్దమనిషి ఈసడించుకుంటూ. ఏంటయ్యా నీకొచ్చిన కష్టం. సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండడయ్యా అని చెబుతుంటే ఇలా తల పట్టుకుంటావేంటి అని కసురుకున్నాడు చంద్రబాబు. మొన్నీ మధ్యే ఆయన అన్నట్టు రోజుకో ఈవెంట్ చేసి పర్యాటకులను ఆకర్షిద్దామని ప్రయత్నిస్తుంటే, ఖర్చులౌతున్నాయి మొర్రో మని మీ ఏడుపులేంటి? అంట.
అసలు విషయమేంటంటే చంద్రబాబుగారు సిఎమ్ గా అవతరించినప్పటి నుంచి విశాఖను ఆర్థిక రాజధాని అని, ఐటి హబ్ అని బోలెడు ముద్దు పేర్లతో పిలవడం మొదలెట్టారు. ఏ మీటింగు పెట్టినా విశాఖలోనే. ఏ సమ్మెట పెట్టి కొట్టినా విశాఖపైనే. అలా విశాఖ నగరానికి వీలైనంత ఖ్యాతిని తేవడానికి చంద్రబాబు పడని ఆపసోపాలు లేవు. నిరుడైతే ఎన్ని ఈవెంట్లు ఇక్కడ జరిగాయని. ఫ్లీట్ రివ్యూ, బ్రిక్స్ సదస్సు, సీఫుడ్ సదస్సు, విశాఖ ఉత్సవ్ లతో వైజాగ్ కళకళ లాడిపోయింది. ఈ ఏడాదేమైనా తక్కువ తిందేంటి. ఇంటర్నేషనల్ ఇనోవేషన్ ఫెయిర్, దసరా ఉత్సవ్, ఆనంద దీపావళి, బెలూన్ ఫెస్టివల్, ఎపి అగ్రిటెక్ లాంటి మహా మహా సంరంభాలన్నీ విశాఖలోనే జరిగాయిగదా. అలాగే మళ్లీ విశాఖ ఉత్సవ్ ను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని బాబుగారు ఆదేశాలు జారీ చేసారు. 
అసలివన్నీ చేయడంవల్ల, అసలివన్నీ ఇక్కడ చేయడం వల్ల విశాఖకు ఏం ఒరిగింది అని మళ్లీ ప్రశ్న లేవనెత్తాడు మిస్టర్ పెద్దమనిషి. అదివిని అంతెత్తున ఎగిరాడు చంద్రబాబు. ఏం జరగడమేంటి 600 కోట్ల ఆదాయం ఉన్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 300కోట్ల అప్పు ఉండే స్థాయికి ఎలా వచ్చింది. వీటివల్లే కదూ. ఇది ఘనత కాదా? అని నేను ప్రశ్నిస్తున్నాను అన్నాడు బాబు మహావేశంగా. 
రకరకాల సదస్సులు పెట్టడం వల్లే కదా విశాఖ సుందరీ కరణ జరిగింది. అందుకోసమే కదా వందల కోట్లను విశాఖా మున్సిపల్ కార్పొరేషన్ చేత ఖర్చు చేయించింది. నిరుడు జరిగిన ఐఎఫ్ ఆర్ కోసం విశాఖ నగరాన్ని 125 కోట్లు ఖర్చు పెట్టించి బ్యూటిఫుల్ గా డెకొరేట్ చేయించాం. మహానాడు కోసం మరో నాలుగున్నర కోట్లు పెట్టి మహా నగరాన్ని ముస్తాబు చేయించాం. అఫ్ కోర్స్ ఈ ఖర్చులు పెరగడం వల్ల మురుగు కాల్వలు, రోడ్లు, పారిశుధ్యం వంటి పనులకు డబ్బుల్లేక వాటిని వదిలిపెట్టేశాం. అని కూడా వివరణ ఇచ్చాడు బాబు.
ఇదంతా విన్న మిస్టర్ పెద్దాయనకు కోపం కైలాసగిరికి అంటింది. అవునౌను హుదూద్ తుఫానప్పుడు వెయ్యి కోట్లు సాయం చేస్తానని మోదీ చెబితే 600కోట్లకే ప్రతిపాదనలు పంపి వచ్చే నిధుల్లో చిల్లు పెట్టారు. పోనీ వచ్చిన ఆ 600 కోట్లనైనా విశాఖను బాగు చేయడానికి వాడారా అంటే అదీ లేదు. ముష్టేసినట్టు 7 కోట్లు కార్పొరేషన్ కు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. విశ్వ నగరంగా విశాఖ అంటే ఉట్టి మాటలతో అవ్వదు. ఈవెంట్లు చేసి, సదస్సులు పెడితేనే విశాఖకు ప్రచారం కాదు. ఉత్సావాలు చేసి, పండుగలు జరిపినంత మాత్రాన పర్యాటకులు వచ్చేయరు. మహానగరానికి మేకప్ వేసి, అందుకోసం కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అభివృద్ధి చెందదు. విశాఖ నగరానికున్న సహజ సౌందర్యాన్ని తిరిగి తేవాలి. అందుకు చిత్తశుద్ధి కావాలి. నీకు చెత్త బుద్ధి తప్ప చిత్త శుద్ధి అనేది లేదు. నువ్వుండగా విశాఖకు పూర్వ వైభవం రాదు అని బాబు ముఖానే కుండ బద్దలు కొట్టి వెళ్లిపోయాడు పెద్దాయన. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com