Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                 
    Show Latest News
పప్పుబాబు పిత్రోత్సాహం

Published on : 06-Feb-2018 | 12:18
 


అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అంటారు గదా. అలాగే చంద్రబాబు కంటె కంటే ఐదాకులు ఎక్కువే చదివాడు లోకేష్. ఈమధ్యే ఆ పప్పుగారి నోటుకి తాళం వేసారేమో, ఎక్కడా పప్పు డప్పు చప్పుడు లేదు అనుకునేలోగా మళ్లీ తనదైన శైలిలో ఏసేసాడు చినబాబు. అమెరికాలో ఎన్నారైలతో ముచ్చటిస్తూ అమెరికాలోనూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చేలా ఉంది అంటూ తన విచక్షణా జ్ఞానాన్ని బైట పెట్టాడు. అభిమానులను చూడగానే రెచ్చిపోయే పప్పు బాబు పచ్చ కండువాలు ఎదురుగా కనిపించగానే అమెరికా అంతా కూడా ఎల్లో కలర్ లో ఉంటే బావుండని ఫీలైనట్టున్నాడు. 

అది వినగానే సభికులందరూ పొట్టలో పిజ్జా బర్గర్లన్నీ పొర్లిపోయేలా పడీ పడీ నవ్వారు. ఇంకా నయం ట్రంప్ పై పోటీ చేసి ప్రెసిడెంట్ ని అయిపోతాననలేదు అనుకున్నారు కొందరు. పప్పు బాబు అంత పనీ చేయగలడు అని గుసగుస లాడారు మరి కొందరు. బాబు గారి వియ్యంకుడు బాలయ్య ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఫోజు కొట్టగా లేంది, అమెరికాలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఏమంత కష్టమౌతుందని అని కూడా కొందరు తర్కించుకున్నారు. 64 ఏళ్లవయసులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని  చేస్తున్నారని లోకేష్ తండ్రి గురించి పొగిడినప్పుడు కూడా సభికులంతా కర్ర, తాళ ధ్వనులతో స్పందించారు. ఎందుకంటే వేమన పద్యంలో కొడుకును నలుగురూ పొగిడితే తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుందని చెప్పారు, కానీ తండ్రినే పొగిడే కొడుకు దొరకడం చంద్రబాబు చేసుకున్న అదృష్టం కదా.  కనుక చంద్రబాబుకు పుత్రోత్సాహం కంటే, లోకేష్ కు పిత్రోత్సాహమే ఎక్కువ అని ఆహుతులందరూ అర్థం చేసుకున్నారు. 
 
Labels : YSRCP, YS Jagan, NCBN,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com