Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం బాబుకు బాగా తెలుసు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తుపాను బాధితులు                               చ‌ల్ల‌వానిపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 324వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
పచ్చబడ్డ ముఖాలు

Published on : 01-Oct-2018 | 17:56
 


ఆంధ్రప్రదేశ్ లో ఏమూల ఏ ఘోరం జరిగినా దాన్ని ప్రతిపక్ష పార్టీకి, ఆ పార్టీ అధినేతకు అంటగట్టాలని ముందే ప్రయత్నం చేస్తుంది టిడిపి ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ విషయంలో ముందు వరసలో ఉంటారు. నిన్నిటి కిడారి, సోమలను మావోలు హత్యలచేసినప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే. ఈ దాడిలో ప్రతిపక్షాల పాత్ర ఉన్నట్టుగా ఆయనకు అనిపించిందట. గతంలోనూ బాబుగారు తుని సంఘటనకు కూడా ప్రతిపక్ష పార్టీనే కారణమంటూ తేల్చేసారు. ఇంటిలిజన్స్, పోలీసులు, దర్యాప్తు సంస్థలు, ప్రత్యక్ష సాక్షులు ఇలా ఎవ్వరి ప్రమేయం లేకుండా బాబుగారే కొన్ని ఘటనలకు కొందర్ని బాధ్యులను చేసిపారేస్తారు. తుని రైలు సంఘటనకు రాయలసీమ నుంచి వచ్చిన రౌడీలే కారణం అని, అదంతా ప్రతిపక్ష పార్టీ చేయించిందని ప్రచారం చేయబోయారు. పోలీసు యంత్రంగాం, దర్యాప్తు తర్వాత నిజాలను నిర్థారించిన తర్వాత బాబు ఆరోపణలన్నీ ఆవాస్తవాలే అని రుజువైంది. ఇప్పుడు అరకు ఎమ్మెల్యేల హత్యోదంతం కూడా మావోల పని అని అధికార వర్గాలు తేల్చాయి. అంతేకాదు అందుకు కారణం కూడా ఎమ్మెల్యేల అనుచరులు, వారికి దగ్గరి వాళ్లు అందించిన సమాచారమే అని బైటపడింది. మాజీ ఎమ్మెల్యే సోమను, కొని తెచ్చుకున్న ఎమ్మెల్యే కిడారిని కలిసి పనిచేసుకోమని పైనుంచి తాఖీదులందాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అందులో పంపకాలు, ఒప్పందాలు ఎన్నో జరిగాయన్నది బహిరంగ సత్యమే. బాక్సైట్ తవ్వకాల గురించే మావోలు ఆరా తీసారన్న వాస్తవాలను ఆ నాయకుల డ్రైవర్లు, గన్ మెన్లు పత్రికలకు, ఛానెళ్లుకు ఎప్పుడో బైటపెట్టేశారు. అయినా సరే చంద్రబాబు మాత్రం పట్టపగలే నిజాలపై ముసుగేసి చీకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అసలు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చేస్తున్న బాక్సైట్ తవ్వకాల గురించి మావోలు ఈ హత్యలు చేయలేదని, వారి ఉనికిని చాటుకోవడానికే చేసారంటూ ప్రజలను వ్యర్థంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవాలు అరకు లోయను దాటి రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. బాబు బాక్సైట్ దాహానికే ఎమ్మెల్యేలు బలయ్యారన్నది స్పష్టం అవుతూనే ఉంది. దర్యాప్తులోనూ నేతల అనుచరులే వారి సమాచారం మావోలకు సహకరించారని తెలుస్తోంది. ప్రతిపక్షంపై ప్రతిదీ నెట్టేసి వికటాట్టహాసం చేసే చంద్రబాబుకు కిడారి, సోమల హత్యానివేదిక కంగు తినిపించింది. అరకు ఘటనకు బాధ్యులు, బాధ్యత అంతా టిడిపి వైపే వేళ్లు చూపిస్తుండటంతో అవమానభారంతో బాబుతో సహా తెలుగు తమ్ముల్ల ముఖాలన్నీ పచ్చబడుతున్నాయి. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com