Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఎన్‌డీఏ స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌త్యేక హోదాపై స‌భ‌లో చ‌ర్చించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               మొద‌లైన జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్రమం                               118వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పోలిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రారంభం                               అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేదాకా మేం పోరాడుతూనేఉంటాం: ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి                                అవిశ్వాసంపై సభలో నాలుగు సార్లూ ఒకే డ్రామా నడిచింది: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు తరహాలో లాలూచీ రాజకీయాలు చేయడం తమకు రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నాం: ఎంపీ అవినాష్‌ రెడ్డి                               హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా?: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర ప్రారంభం                               దేశ రాజకీయాల్లో చంద్రబాబు నంబర్‌వన్ ద్రోహి: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                  
    Show Latest News
విమర్శ కాదు సమస్య

Published on : 19-Feb-2018 | 14:08
 

ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ఆర్  సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎపి ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రినీ విమర్శనాస్త్రాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. బాబు అవినీతి, చేతగానితనాన్ని అడుగడుగునా ఎదిరిస్తున్నారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయిన తెలుగుదేశం అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులందరికీ అల్టిమేట్టం జారీ చేసారు. అదేమిటో చూడండి.
ఇకపై ప్రతిపక్ష పార్టీ చేసే ప్రతి విమర్శకీ ప్రతి విమర్శ ఉండాలింఅన్నాడు చంద్రబాబు.
కొంచెం అర్థం కాక తెల్లముఖం వేసారు టిడిపి నేతలు. 
అదేనయ్యా వాళ్ల విమర్శకి మన ప్రతివిమర్శ అన్నమాట అర్థం అయ్యేలా చెప్పాడు బాబు. 
ఓ అదా. మేం చేస్తూనే ఉన్నామే అన్నారు ఆశ్చర్యంగా.
మీ ముఖం చేస్తున్నారు. మన భాగోతమంతా ఎక్స్  పార్టీ నాయకుడు కథలు పిట్ట కథలుగా చెప్పేస్తుంటే, కాదనేలా ఒక్కళ్లైనా తిప్పికొట్టగలిగారా. ఇట్స్ ఎ షేమ్. 
ఏం చేద్దాం సార్ అతనేమో నిజాలు చెబుతున్నాడు. మనమేమో కవరింగ్ లు చేయాలాయే అన్నాడో నేత.
సరే సరే ఇక నుంచైనా వాళ్ల విమర్శలకు గట్టిగా బదులివ్వండి చెప్పాడు బాబు. 
మరి మీ మీద ఉన్న కేసుల గురించి అడుగుతున్నారు దానిపై ఎలా స్పందించాలంటారు? అడిగాడో సీనియర్ మంత్రి.
మా అధినేత కేసులకు భయపడడు అని చెప్పండి.
అవును అలా చెప్పి, కేసులకు స్టేలు తెచ్చుకుని తప్పించుకు తిరుగుతున్నాడని జనాలు ఆల్రెడీ అనుకుంటున్నారు అనుకున్నాడు మనసులో.
మీరు కేంద్రానికి భయపడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ చెవిన ఇల్లుకట్టుకుపోరుతోందే? మరో నేత ప్రశ్నించాడు.
చంద్రబాబుకు కేంద్రం అంటే భయం లేదు, అలాగని కేంద్రంతో గొడవపెట్టుకోవడం ఆయన ఉద్దేశ్యం కాదు అని చెప్పండి.
ఈ రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయే?
అలా ఉంటేనే కదా వాళ్లు ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉండిపోయేది.
అయితే ఒకె.
హోదాను మీరు తాకట్టు పెట్టడం గురించి, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగకపోవడం గురించి, నాలుగేళ్లుగా విభజన హామీలపై ఏం సాధించలేదని విమర్శిస్తున్నారు గదాంవీటిపై ఎలా స్పందించాలంటారు???
కేంద్రంతో ఫైటింగ్ చేస్తున్నామని ఎంత బిల్డప్ ఇద్దామనుకున్నా అది ప్రజల్లో నమ్మకాన్ని పెంచలేదు. అందుకే ఇప్పటినుంచైనా ప్రతిపక్షం మనపై చేసే విమర్శలకు అడ్డగోలు సమాధానాలు ఇవ్వండి. త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పండి. త్వరలో దీనిపై చర్చిస్తామని అనండి. 
ఎపి కేటాయింపులపై పోరాటం కొనసాగిస్తున్నామని నమ్మించండి. హోదా కంటే ప్యాకేజీలో ప్రయోజనాలు ఎక్కువ అన్నందుకే ఒప్పుకున్నామని గోడమీద పిల్లివాటంగా చెప్పండి. 
ప్రతిపక్షపార్టీ ఎమ్.పిల రాజీనామాలు మన మెడకు చుట్టుకుని, మనవాళ్లనూ రాజీనామాలు చేయమని ఒత్తిళ్లు వస్తున్నాయి. 
అలాంటప్పుడు కేంద్రంతో మరోసారి చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటన ఇవ్వండి. రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చిస్తామని మరోసారి ఆశపెట్టి వదిలేయండి. 
మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు బిజెపి కి దగ్గరౌతున్నాడని ప్రచారం పెంచండి. బిజెపి, వైయస్ఆర్ మైత్రీ బంధంపై ఆంగ్లపత్రికల కథనాలు అంటూ హడావిడి సృష్టించండి. జగన్ పై ఈడీ కేసులు లాంటి కథనాలకు మసాలాలు దట్టించమని మన బాజా పబ్లిషర్స్ అండ్ ఛానల్స్ కు చెప్పండి అని చెప్పి సమావేశాన్ని ముగించేశాడు. 

విశాఖ సదస్సులో ఎన్నిలక్షల కోట్ల ఎమ్.ఓ.యులు చెప్పాలో, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పాలో ప్రణాళికలు వేసుకోవడంలో మునిగిపోయాడు బాబు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com