Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  
    Show Latest News
మ్యాజిక్ షో

Published on : 22-Mar-2017 | 13:19
 

ప్రపంచ ప్ర‌సిద్ధిగాంచిన మెజీషియ‌న్ పిసి. స‌ర్కార్‌ని చంద్ర‌బాబు పోటీకి పిలిచాడు. స‌ర్కార్ త‌న మంది మార్భ‌లంతో అమ‌రావ‌తికి వ‌చ్చాడు. 
మొద‌ట స‌ర్కార్ ఒక చెక్క‌పెట్టేలోకి అమ్మాయిని పంపి మాయం చేసాడు. అది చూసి చంద్ర‌బాబు న‌వ్వాడు. `మీరు వున్న‌దాన్ని మాయం చేస్తారు.. నేను లేనిదాన్ని సృష్టిస్తాను` అన్నాడు. 
ఒక ఖాళీ చెక్క‌పెట్టేను గాల్లోకి వూపి `హుష్ ప‌టాష్` అన్నాడు. పెట్టెలోంచి ఒక రైల్ ఇంజ‌న్ వ‌చ్చింది. 
``ఏంటిది...?`` క‌ంగారుగా అడిగాడు స‌ర్కార్‌
``ఇది గుంటూరు, విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తిని క‌లుపుతూ తిరిగే మెట్రోరైల్‌`` అన్నాడు బాబు.
త‌రువాత స‌ర్కార్ గాల్లోంచి ఒక పావురాన్ని సృష్టించాడు. 
``ఇప్పుడు మీరు లేనిదాన్ని సృష్టించారు. నేను ఉన్న‌దాన్ని మాయం చేస్తాను చూడండి`` అని బాబు `జై అమ‌రావ‌తి` అన్నాడు. వెంట‌నే చుట్టు ప‌క్క‌లున్న వేల ఎక‌రాల పంట పొలాలు మాయ‌మ‌య్యాయి.
``ఏం చేసారు వాటిని..?`` ఆశ్చ‌ర్యంగా అడిగాడు స‌ర్కార్‌
``అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో మా పార్టీ నాయ‌కులు మాయం చేసారు`` అన్నాడు బాబు
ఈ సారి చేతిలో ఉన్న టోపీని మాయం చేసాడు స‌ర్కార్‌. చంద్ర‌బాబు లేని టోపీల్ని సృష్టించి జ‌నం నెత్తిన పెట్టాడు. 
టోపీలు పెట్టడంలో నువ్వు పోటీపడలేవు. గత 40 ఏళ్లుగా ఇదే పనిమీద ఉన్నాను అని అన్నాడు బాబు
సర్కార్ తల గోక్కొని మీకు ఇన్ని మ్యాజిక్ లు వచ్చని నాకు తెలియదే అన్నాడు
``ఇంకా చాలా వ‌చ్చు చూస్తావా`` అని చంద్ర‌బాబు `హుష్ ప‌టాష్‌`` అన్నాడు. వేల‌మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వ‌చ్చేశాయి. రుణ‌మాఫీ అయిన రైతులంతా అనందంతో గెంతులేసారు. డ్వాక్రా మ‌హిళ‌లు పాట‌లు పాడారు. 
స‌ర్కార్ పేక ముక్క‌లు తీసుకుని గిరగిరా తిప్పాడు.
చంద్ర‌బాబు బ‌డ్జెట్ కాగితాలు గిరగిర తిప్పితే అంకెల‌న్నీ తారుమారై రాష్ట్రం నిత్యక‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణంలా క‌నిపించింది. 
చిట్ట చివ‌రిగా స‌ర్కార్ ఒక ఏనుగుని మాయం చేసాడు. 
చంద్ర‌బాబు చిరున‌వ్వు న‌వ్వి `హుష్ ప‌టాష్‌` అంటే రాష్ట్ర ఖ‌జానా మాయ‌మైంది. 
స‌ర్కార్ ఓట‌మి ఒప్పుకున్నాడు. 
``నాలో మాయ‌చేసేవాళ్లు ఈ దేశంలోనే లేరు`` అన్నాడు బాబు
``నిజ‌మే, కానీ మ్యాజిక్ షో అబ‌ద్ద‌మ‌ని అంద‌రికీ తెలుసు. కొంత కాల‌మే షోని జనం న‌మ్ముతారు. ఆ త‌రువాత మాయ నుంచి బ‌య‌ట‌కొస్తారు. రేప‌టి ఎన్నిక‌ల్లో మీ మంత్రం పార‌దు`` అన్నాడు స‌ర్కార్‌. 
``పారినంత కాలం, పారించ‌డ‌మే మంత్ర‌మంటే. ఈ లోగా అమ‌రావ‌తిని స‌ర్దేస్తాను`` అన్నాడు బాబు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com