Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             టకారిపాలెం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం.                                లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు: వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                                నటి శ్రీదేవి మృతి పట్ల వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి                               ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తున్నానని భరోసా ఇస్తున్నా : వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               బాబు పాల‌న‌లో ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుంది: వైయ‌స్ జ‌గ‌న్‌                               ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోంది: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                                చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                 
    Show Latest News
"లడ్డూ కావాలా బాబూ"

Published on : 26-Aug-2017 | 16:54
 

‘’లడ్డూ కావాలా బాబూ’’ చంద్రబాబు కల్లోకి వచ్చి అడిగాడు వినాయకుడు.
మాట్లాడలేదు బాబు.
‘’లడ్డూ కావాలా నాయనా’’ మళ్లీ అడిగాడు వినాయకుడు.
‘’నేను నాయనను కాను చంద్రబాబు నాయుడును’’ అన్నాడు బాబు సీరియస్ గా.
‘’సరే సరే ఇంతకీ నీకు లడ్డూ కావాలో వద్దో చెప్పలేదు’’
‘’నాకు లడ్డూ వద్దు స్వామీ’’ చిరాగ్గా అన్నాడు చంద్రబాబు.
‘’ఏం బాబూ’’ అడిగాడు స్వామి…నాయనా అంటే మళ్లీ ఎక్కడ చిరాకు పడతాడో అని. 
‘’నాకిప్పుడు లడ్డూ మీద ఇష్టం లేదు స్వామీ’’. 
‘’అదే ఎందుకు అంటున్నా’’  రెట్టించి అడిగాడు వినాయకుడు
‘’ నీ లడ్డూ నాకక్కర్లేదు స్వామీ. నేనే నీకు రోజు లడ్డూ లిస్తాను కావాలంటే’’ 
‘’ అందుకే అంటున్నాను నాయనా…రోజూ నా దగ్గర పోగౌతున్న లడ్డూలు ఏం చేయాలో తెలియక ఇలా ఎవరికైనా కావాలేమో అని అడుగుతూ పంచుకొస్తున్నా’’ అన్నాడు వినాయకుడు.
‘’ అంటే మేం నంద్యాల ఉప ఎన్నికల్లో పంచినట్టా’’ అడిగాడు బాబు.
‘’ లేదు బ్రీఫ్డ్ మీ అంటూ తెలంగాణాలో ఓటుకు నోట్లు పంచినట్టు ఈ సారి వినాయకుడు చిరాగ్గా అన్నాడు.
ఈసారి బాబు గతుక్కుమన్నాడు. చిరాకును  కాస్త తగ్గించి ‘’ అదికాదు స్వామీ నాకు లడ్డూ కాదు కాజా కావాలి ’’ అన్నాడు. 
‘’ కాజా నా ‘’ తొండం పైకెత్తి ఆశ్చర్యపోయాడు వినాయకుడు. 
‘’ అవును స్వామీ నాకు కాకినాడ కాజా కావాలి’’ చిన్నపిల్లాడిలా మారం చేస్తూ అన్నాడు బాబు.
‘’ నీ ఖర్మ ఎంచక్కా లడ్డూ తినవయ్యా అంటే కాజా తింటావా…బాగా తిను అయినా నేను ఇవ్వడమెందుకులే కాకినాడ వాళ్లే మహా కాకగా ఉన్నారు నీకు కాజా ఇద్దామని వెళ్లు వెళ్లు - తథాస్తు’’ అని వెళ్లిపోయాడు వినాయకుడు.
కట్ చేస్తే తెల్లారింది.
చంద్రబాబు తనకొచ్చిన కలని గుర్తుచేసుకున్నాడు. 
‘’కాకినాడా కాజా కాజా’’ అని పాటందుకున్నాడు.
ఈలోపు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబుని కలవడానికొచ్చాడు. బాబు పాట విని ‘’ఏమిటండీ అంత హుషారు – నంద్యాల రిజల్ట్ న్యూస్ ఏమైనా తెలిసిందా?’’ అని అడిగాడు. 
‘’ ఛఛ ఆ పేరెత్తకు ’’ చిరాకు పడిపోయాడు బాబు.
‘’ ఓహో నేను అన్నట్టే అయ్యిందన్నమాట నంద్యాల్లో – పోతుందని చెప్పానని అందరూ గయ్యని లేచారు నామీద. చివరకు అదే నిజమైందిగా’’ మనసులో తెగ సంతోషపడిపోయాడు జెసి.
‘’మరైతే ఇప్పుడీ కాజాకాజా బాజా పాటేమిటో ’’ పాయింట్ కొచ్చాడు.
‘’ అదా వినాయకుడు కల్లో కనిపించాడయ్యా జెసి. కాకినాడ కాజా మనకే అన్నాడు’’ అని హుషారుగా చెప్పాడు బాబు.
‘’ ఏంటీ మనకి కాజానేనా….??? అంటే నంద్యాల్లోనే కాదు కాకినాడలోనూ మనపని గల్లంతేనా…!!! నేను అనుకుంటూనే ఉన్నాను’’ అన్నాడు జెసి యథావిధిగా. 
పాపం కాకినాడ ఇవ్వబోయే కాజా ఏంటో అర్థం కాక బాబు ఇంకా పాట పాడుకుంటూనే ఉన్నాడు.
సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com