Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీఎం పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో ప్రజలకు చెప్పాలిః అంబటి రాంబాబు                               దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలుః అంబటి రాంబాబు                               హెరిటేజ్ పై ఉన్న ప్రేమ బాబుకు రాష్ట్ర రైతాంగంపై లేకపోవడం బాధాకరంః కన్నబాబు                               రైతులను గాలికొదిలేసి చంద్రబాబు తన సొంత పనులు చక్కబెట్టుకుంటున్నాడుః కన్నబాబు                               విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ వారి జీవితాలతో చెలగాటం ఆడడం తగదుః శివకుమార్                               ఫీజులను చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 24న టీ వైయస్సార్సీపీ ధర్నా                               ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్ల ప్రకాశం జిల్లాలో 424 మంది చనిపోయారుః వైవి సుబ్బారెడ్డి                               ఈ నెల 20న కనిగిరి, పాలవరం, పీసీ మండల ప్రాంతాలలో వైయస్ జగన్ పర్యటన                               కిడ్నీ బాధితులకు అండగా వైయస్ జగన్                 
    Show Latest News
అమరాహిష్మతి

Published on : 22-Dec-2016 | 11:31
Share    

బాహుబలి తరహాలో అమరాహిష్మతి నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించాడు. వెంటనే సినిమా దర్శకుల్ని, కళాదర్శకుల్ని పిలిపించాడు. 
"ఇక్కడ సెలఏరుండాలి" అని చెప్పాడు ఓ ప్రాంతాన్ని చూపించి
"నీళ్లే లేని చోట సెలయేరు ఎక్కన్నుంచి వస్తుంది" అని అడిగాడు ఒకాయన
"నీళ్లు లేకుండా పట్టిసీమ అని మ్యాజిక్ చేసినవాన్ని నేను. రెయిన్ గన్ తో వర్షాలొస్తాయని చెబితే నమ్మిన అమాయకజనం వీళ్లు. నీళ్లు లేని చోట ఏరు పుట్టించడం, ఏరు లేని చోట నదిని సృష్టించడం నాకు అలవాటే. మీరు కానివ్వండి" అన్నాడు బాబు
ఒక ప్రాంతాన్ని చూపించి ఇక్కడ ఇరవై అడుగుల బుద్ధవిగ్రహం, వంద అడుగుల నా విగ్రహం ఏర్పాటు చేయండి అన్నాడు
"అదేంటి బుద్ధుడి కంటే మీ విగ్రహమే పెద్దదా?" అని అడిగాడు కళాదర్శకుడు
"అవును బుద్ధుడికి బుద్ధి లేదు కాబట్టే రాజకుటుంబంలో పుట్టి రాజ్యాన్ని వద్దనుకున్నాడు. నాకు బుద్ధుంది కాబట్టే రైతు కుటుంబంలో పుట్టి రాజ్యమేలుతున్నాను. బుద్ధుడి కంటే నేనే గొప్పవాన్ని" అన్నాడు బాబు
"వంద అడుగుల విగ్రహమంటే అది చెక్కడానికి చాలా సమయం పడుతుంద" అని చెప్పాడొకాయన
"మీరేం చేస్తారో నాకు తెలియదు. అంతా జెట్ స్పీడుతో జరిగిపోవాలి. ఒకేసారి వెయ్యిమంది శిల్పుల్ని రప్పించండి"
"ఈ కాలంలో వెయ్యిమంది శిల్పులు ఎక్కడ దొరుకుతారు సార్"
ఎక్కడో ఒకచోట దొరుకుతారు. ప్రయత్నించండి. రెండున్నరేళ్లుగా నేను అమరావతిని ఎలా చెక్కుతున్నానో చూస్తున్నారు కదా. మరి మీరు విగ్రహాన్ని చెక్కలేరా?
"అమరావతి చెక్కడం పేరుతో మీరు మెక్కుతున్నారు. మీరు చెప్పిన డిజైన్లన్నీ కంప్యూటర్లలోనే తప్ప నిర్మాణంలో లేవు"
అవన్నీ నాకు తెలియదు. ఇక్కడ వంద ఎకరాల సుందర ఉద్యానవనం నెలరోజుల్లో నాకు కనిపించాలి అన్నాడు బాబు
"నెలరోజుల్లో వనం కాదు కదా, మొక్క కూడా మొలిపించలేం. ప్రకృతంటే మీ ఆఫీసులో గుమస్తా కాదు, చెబితే వినడానికి"
"మీతో కాదు కనీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని పిలిపించండి"
"ఆయన బిజీ, వచ్చే ఏఫ్రిల్ వరకు రారు"
"అయితే పవన్ కల్యాణ్ ని పిలిపించినట్టు ప్రత్యేక విమానంలో రప్పించండి. పోయేది జనం డబ్బే కదా"
"స్పెషల్ ఫ్లైట్ లో రాజమౌళి వచ్చాడు"
బాబు చెప్పిందంతా విన్నాడు. వెంటనే బ్లూ మ్యాట్ తెప్పించి అమరావతి అంతా కట్టించాడు. 
"ఇదెందుకు?" అని అడిగాడు బాబు
"మీరు చెప్పిందంతా చేయాలంటే గ్రాఫిక్స్ లో తప్ప సాధ్యం కాదు" అన్నాడు రాజమౌళి
"నాక్కవల్సింది అదే. ఇంతకాలం జనానికి నేను చూపించింది గ్రాఫిక్స్ పాలనే" అన్నాడు బాబు

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com