Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఎన్‌డీఏ స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌త్యేక హోదాపై స‌భ‌లో చ‌ర్చించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               మొద‌లైన జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్రమం                               118వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పోలిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రారంభం                               అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేదాకా మేం పోరాడుతూనేఉంటాం: ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి                                అవిశ్వాసంపై సభలో నాలుగు సార్లూ ఒకే డ్రామా నడిచింది: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు తరహాలో లాలూచీ రాజకీయాలు చేయడం తమకు రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నాం: ఎంపీ అవినాష్‌ రెడ్డి                               హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా?: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర ప్రారంభం                               దేశ రాజకీయాల్లో చంద్రబాబు నంబర్‌వన్ ద్రోహి: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                  
    Show Latest News
బురదోద్వేగం

Published on : 14-Mar-2018 | 16:57
 

                     

బాబు కన్నీళ్లు కర్చీఫ్ తో తుడుచుకుంటే ఆగేలా కనిపించడం లేదు..అది చూసి తమ్ముళ్లు చకాచకా పెద్ద బ్లాంకెట్ తెచ్చిచ్చారు.

దాంతో కళ్లు తెగ వత్తుకుంటూ చెబుతున్నాడు బాబు…

అమరావతిని ఏం చేద్దాం అనుకున్నాను…అమరావతితో ఏం చేద్దాం అనుకున్నాను…

నా కలల రాణి…సారీ నా కలల రాజధాని..విశ్వ నగరానికి ముష్టేసినట్టు 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాంతో నాడ్రీమ్స్ ఎలా ఫుల్ ఫిల్ చేసుకోవాలి…అదే అదే అద్భుత నగరం కట్టాలనే నా డ్రీమ్ ను ఎలా పూర్తి చేసుకోవాలి…? ప్రపంచం శ్రేణి మహా నగరాన్ని నిర్మించాలని కలలు కంటుంటే అమరావతి ఉత్త డ్రీమ్ సిటీ అని అవహేళన చేస్తారా?

బెంగూళూరు మెట్రోకి నిధులిచ్చారు.

ముంబాయి బుల్లెట్రైన్ కి నిధులిచ్చారు.

అహ్మదాబాద్ మెట్రోకి కూడా నిధులిచ్చారు…

కానీ ఎపికి మాత్రం హ్యాండిచ్చారు…ఏం…ఏపి కనబడదా…???

పోర్టు, రైల్వేజోన్, మెట్రో, ఇనుము ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ 6 నెలల్లోపే చేయాలని విభజన చట్టంలో ఉందిగదా…మరెందుకు చేయలేదు..? చెప్పాలి చెప్పితీరాలి…?

ఆర్థిక లోటు విషయంలో కేంద్రానివన్నీ తప్పుడు లెక్కలే.

విద్యాసంస్థలకు కూడా అరొకొర నిధులే ఇస్తున్నారు..ఇలా అయితే విశ్వస్థాయి విద్య విద్యార్థులకు ఎలా అందుతుంది??

‘బాబోద్వేగం’ బద్దలైపోతోంది…’క్రోధం’ కట్టలు తెంచుకుంటోంది.

ఆ ఉద్వేగానికీ, ఆ ఉక్రోషానికీ, ఆ ఆక్రోశానికీ, ఆ ఆవేశానికీ…అసెంబ్లీ దడదడ లాడింది…

బాబ్బాబు..బాబోరు..కాస్త శాంతించండి…మునుపు చిన్న వర్షానికే సచివాలయం సొట్టలుపడి, చిల్లులు పడి, ప్రతిపక్షం నోళ్లలో పడి, ప్రజల తిట్లలో పడి నానా రచ్చా అయ్యింది. ఇప్పుడు మీ ఉద్వేగానికి ఇది కంపిస్తే ఏమౌతుందో…??? అని పచ్చ కండువాతో విసిరి శాంతిప చేసారు.

లైవ్ లో అన్నీ చూస్తున్న జనాలకు ఒళ్లు మండింది. అరువుకు ఎక్కువ పరువుకు తక్కువ అని…అడగాల్సిన టైమ్ లో అడగడం మానేసి, అంతా అయిపోయాక కల్లబొల్లి ఏడుపులేంటని ఛీదరించుకున్నారు. 6 నెలలోపు విభజన హామీలపై నిర్ణయం తీసుకోవాలని చట్టంలో ఉంటే….6 నెలల తర్వాత వాటిని అమలు చేయమని బాబు మోదీని ఎందుకు అడగలేదు…?? ఆర్థిక లోటు విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు వేస్తుంటే, బాబెందుకు సరి చేయలేదు…?? నాలుగేళ్లుగా యూనివర్సిటీలకు అరకొర నిధులిస్తుంటే బాబెందుకు పట్టించుకోలేదు…??? రాజధానికి ముష్టేస్తుంటే ఇదేంటని ఎందుకు నిలదీయలేదు…?? ఎందుకంటే అప్పుడు ఎన్నికలు దగ్గర్లో లేవు..ఇప్పుడు ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి…బాబు బురదోద్వేగానికి కారణం మాకు ఆ మాత్రం తెలియదా అని సింపుల్ గా తేల్చేసారు తెలుగు ప్రజలు.

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com