Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
    Show Latest News
అభివృద్ధిలో దూసుకుపోతున్న మద్యాంధ్రప్రదేశ్

Published on : 03-Jul-2018 | 11:00
 

 అందరూ ఆడిపోసుకుంటున్నారు గానీ మన ముఖ్యమంత్రి చెబుతున్న బహుముఖాభివృద్ధిలో ఇది మాత్రం లేదేమిటీ!! అత్యద్భుత మద్యం విధానాల ద్వారా, బీరును హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసిన కారణంగా, బెల్టు షాపులను మహత్తరంగా నడిపిస్తున్న పుణ్యాన రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో అభివృద్ధి జెర్రి గొడ్డంత స్పీడుగా పోతోందిట. ఎక్కడైతే ఏం అభివృద్ధి సూచి అమాంతం పైకెళ్లడం కావాలిగానీ, ప్రమాదాల్లో, నేరాల్లో, మహిళలపై అఘాయిత్యాల్లో, భూకబ్జాల్లో, మద్యం అమ్మకాల్లో ఇలా ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అమిత వేగంతో ముందుకు పోతోంది. దాన్నలా ముందుకు తీసుకుపోతున్న ఘనత అక్షరాలా మన అమరావతీధీశ చంద్రబాబుగారిదే.

 ఏటికేడాది సాగు విస్తీర్ణం తగ్గిపోవచ్చుగాక, గొలుసు మద్యం దుకాణాలు బారులు తీరుతున్నాయిగా! పంటలకు మద్దతు ధర పెరగకపోతే ఏమిటి నష్టం, ఆ గుబులు, దిగులు తీర్చే బాటిళ్ల ఖరీదు పెరుగుతూనే ఉందిగా! ఉద్యోగాల కల్పనలో వృద్ధి శాతం స్వల్పంగానే ఉందని బాధేల, లిక్కర్ 9.38, బీరు 14.64 శాతం వృద్ధిని నమోదు చేసాయి చంకలు గుద్దుకోండి. లిక్కర్ ను బీట్ చేస్తూ బీరు ముందుకు పోవడాన్ని గురించి మద్యాసురులు తెగ ఆనంద పడుతున్నారట. బీరుకు హెల్త్ డ్రింక్ హోదా కల్పించి, బేకరీల్లో సైతం దొరకాలని సూచించిన ప్రభుత్వ పెద్దలకు వారు వెయ్యి బీరు బాటిళ్లతో అభిషేకం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట.

 మరే రంగంలోనూ లేనివిధంగా మద్యం అమ్మకాల్లో రాష్ట్రం మాంచి జోరుమీదుందని సర్వేలు చెబుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం షాపులకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు చేయించే రోజులు చెల్లిపోయాయి. షాపులకు టార్గెట్లు లేవు. అయితేనేం అమ్మకాలు మాత్రం ఊపందుకున్నాయి. బలవంతం మీద కన్నా టార్గెట్ లెస్ విధానంలోనే మద్యం అమ్మకాలు మహా స్పీడుగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  బెల్టుషాపులపై, ఇళ్ల మధ్య మద్యం దుకాణాలపై మహిళలు విరుచుపడి, వాటిని ధ్వంసం చేసి ఆవేశం, ఆయాసం తెచ్చుకున్నారు కానీ, రావణుడి తలల్లా ఒకటి కూలిస్తే రెండు మద్యం షాపులు మొలుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు గారి సారధ్యంలో, ఎపి మద్యం విధానంతో, సిండికేట్ల లాలూచీలతో రాష్ట్ర మద్యం అమ్మకాల అభివృద్ధి అలా అలా ఆకాశాన్ని తాకుతుండటాన్ని సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు. 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com