Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
పరమాశ్చర్యం

Published on : 02-Jun-2018 | 17:49
 

చంద్రబాబుకు పరమాశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఎమ్మెల్యేలను కొంటారా? ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? హవ్వ...ఎక్కడైనా విన్నామా, కన్నామా అంటూ గుండెలు బాదుకున్నారు. కర్ణాటకలో బీజెపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనడం అక్రమం అని కన్నెర్ర చేసారు. సచివాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఆశ్చర్య, సంభ్రమాశ్చర్యాలను చూసి విలేఖరులే మూర్ఛపోయారట.

చంద్రబాబు గొప్పతనం అదే. ఏ గురివిందా తనకింద మచ్చుందని ఒప్పుకోదు. అలాగే బాబుగారు సైతం తాను చేసిన పనులను సునాయాసంగా మర్చిపోతారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కున్న విషయాన్ని అలవోకగా మరచిపోయి, బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందంటూ నిస్సిగ్గుగా ధ్వజం ఎత్తగలరు బాబు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను కొనబోతూ, ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి, అర్థంతరంగా ఉమ్మడి రాజధానిని వదిలి పారిపోయి వచ్చిన మాట కూడా సులభంగా మరచిపోయి బీజేపీ తీరు అన్యాయం అంటూ అరవగలరు.

బాబూ తీరే అంత. గతంలో తిట్టిన నోటితోనే నేడు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధం అయిపోయాడు. మోదీని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వను అన్నమనిషే మోదీని వేనోళ్ల పొగిడాడు. బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను కొనడానికి దిగజారిపోయారని విమర్శిస్తున్నారు బాబుగారు. తమ పార్టీలోకొస్తే బాగా సంపాదించుకోవచ్చని చెప్పారని ఆగ్రహించారు. ఇంత వింత పోకడ నేనెప్పుడూ చూడలేదన్నారు. నిజమే మరి కొత్త పోకడలు, బేరసారాలు ఆయన చేయడమే తప్ప వేరొకరు చేయగా చూడ్డం ఇదే మొదలేమో! అందుకే ఆయన అంతగా హాశ్చర్యపడిపోయారు.  

కాంట్రాక్టులు పంచుకోవడం, కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, ఇసుక, మట్టిని తవ్వుకుపోవడం, అవినీతిని కూడా వ్యవస్థీకృతం చేయడం, దోపిడీకి రాచబాటలు వేయడం, అన్యాయాలకు అధికారిక రాజముద్ర ఇవ్వడం చంద్రబాబు నీతి. ఇదికానిదేదైనా ఆయనకు అవినీతి, అక్రమం. ఆయన చేస్తే వ్యాపారం మరొకరు చేస్తే యవ్వారం. 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com