Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
    Show Latest News
ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడిపేరు చంద్రబాబు

Published on : 07-Jul-2018 | 11:19
 

అమరావతి ఓ భూతల స్వర్గం. అక్కడ నిలబడి ఏది చెబితే అది నిజం అయిపోతుంది. ఇక్కడ విశ్వనగరం ఉంది అంటే చాలు విశ్వకర్మకు కూడా కళ్లుచెదిరేలాంటి మాయా నగరం అదేనండి మహానగరం ప్రత్యక్షం అయిపోతుంది. లక్ష ఉద్యోగాలు అని అనగానే నిరుద్యోగులందరూ టై కట్టుకుని, షూ వేసుకుని ఉద్యోగాలకు బయలుదేరిపోతూ మన కళ్లకు కనిపిస్తారు. అలాగే అమరావతిలో నిలబడి మూడు లక్షల ఇళ్లు అనగానే ముచ్చటైన టూ బెడ్రూం ఇళ్లు సర్వాంగ సుందరంగా మన ముందుకు రెక్కలు కట్టుకుని వచ్చి వాలతాయి. అదంతా అమరావతి మహిమో లేక అమరావతీనాథుడు నారా చంద్రబాబు నాయుడు మహిమో చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే బాబంటే అమరావతి అమరావతంటే బాబు. ఆయన్ను చూస్తే రాజధాని అమరావతిని చూసినట్టే. ఆయన కట్టేస్తున్న పోలవరాన్ని చూసినట్టే. అలాగే మూడులక్షల ఇళ్లనూ చూసినట్టే.

దేనికైనా విజన్ ఉండాలి అంటారు బాబు గారు. అవును 2017కే పోలవరం పూర్తయిపోతుందని బాబుగారి ఆ విజనే చిలకజోస్యం చెప్పింది. ప్రత్యేక హోదా వస్తుందని కూడా అదే విజన్ చెప్పింది. అలాగే హోదా కంటేప్యాకేజీ గొప్పని, ప్యాకేజీ హోదా రెండూ సమానమని, ఆనక హోదా ఎందుకూ కొరగాదని కూడా చెప్పింది. ఆ విజనే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల గురించి కూడా చెబుతోంది. రేపటి భవిష్యత్తును నేడే చూడటం, దాన్ని తన కళ్లతో ప్రజలకు చూపించడమే బాబు గారి బ్రహ్మాండమైన విజన్. ఇంత గొప్ప విజన్ ,ప్రఖ్యాతి గాంచిన ఏ కంటి ఆసుపత్రిలో కూడా దొరకదని మనం సంబరపడాలి. దీన్ని అరచేతిలో వైకుంఠం లాంటి పాత చింతకాయి సామెతలో పోల్చొద్దని మనవి.

నిరుడు బాబుగారు 2లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేసార్ట. ఈ ఏడాది ఆ రికార్డును ముక్కలు చెక్కలు చేసి 3లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేసార్ట. ఎంతటి అద్భుతమెంతటి అమోఘ మెంతటి చాతుర్యము. ఒక్కో ఇల్లూ చూద్దుము కదా సగం అయిన గోడలు, పునాదలు పూర్తి కాని స్థలాలు, దర్వాజాలు లేని గదులు, స్లాబు లేని గోడలు నయనమనోహరంగా కనిపించాయి. ఇందులో ఏమి వింత ఉన్నది అంతకు మించిన వింతలు ఉన్నాయి. నిరుడు పూర్తయి నివాసం ఉంటున్న ఇళ్లకు మళ్లీ గృహప్రవేశాలు చేసారు తెలుగు తమ్ముళ్లు. పేదల ఇళ్ల లబ్దిదారులకు అందించిన సొమ్ము తెలుగుదేశం పార్టీఅనుయాయులకు చేరగా విలాసవంతంగా కట్టిన ఇంద్రభవనాలకూ అధికారులు, అధికార పార్టీ నేతలూ కలిసి గృహప్రవేశాలు జరిపారు.  బాబు గారి పాలనలో అమరావతి రాజ్యంలో ఇలాంటి వింతలకు కొదవేలేదు. చూస్తుండండి ఎన్నికల సమయానికి రాష్ట్ర జనాభాకంటే రెట్టింపు ఇళ్లలో గృహప్రవేశం చేయించి రికార్డులకెక్కే ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com