Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                 
    Show Latest News
బాబు 20 ఏళ్ల స్కీమ్

Published on : 17-Dec-2017 | 13:55
 

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో జీవిస్తే 20ఏళ్ల ఆయుష్షు పెరుగుతుందని శెలవిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలెలాగబ్బా...అని జుట్టు పీక్కున్నారు తెలుగు తమ్ముళ్లు. తమకు తెలియకుండా బాబు ఏదో గొప్ప రహస్యాన్ని కనిపెట్టేశాడని అనుకున్నారు. లేకపోతే అంత ఘంటా పథంగా ఎలా చెబుతారు.
అమరావతి పేరుతో బోలెడు కాన్ఫరెన్స్ లు ఉంటాయి. చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్సు ఉంటాయి. అమరావతి రాజధానిపై బోలెడు కథలుంటాయి. రూమర్లుంటాయి. అమరావతి భూములపై పెద్దపెద్దోళ్ల కళ్లుంటాయి. వాటిని కంపెనీలకు ధారపోయడానికి పెట్టుబడుల పేరుతో ప్రభుత్వానికి బోలెడు అవకాశాలుంటాయి. అమరావతికి బిల్డింగ్ డిజైన్లుంటాయి, రాజమౌళి కరెక్షన్స్ ఉంటాయి. ఎప్పటికైనా ఒక్క భవంతైనా రాజధాని అమరావతిలో కడతారా అని ప్రజల్లో గంపెడాశలుంటాయి...ఇవన్నీ ఉంటాయనైతే తెలుసు కానీ 20 ఏళ్ల ఆయుష్షు వుంటుందని మాత్రం వాళ్లకి తెలియదు. అదెలాగో ఏమిటో చంద్రబాబునే అడిగి తెలుసుకుందాం అనుకున్నారు. పోలోమంటూ వెళ్లి బాబు ముందు వాలిపోయారు. 
దానికి బాబుగారు ఓ వికృతమైన నవ్వు నవ్వారు.
ఓ పిచ్చిపచ్చ తమ్ముళ్లూ...నా నోటి వెంట వచ్చే ప్రతి మాటకు వెనక ఓ అంతరార్థం ఉంటుందని మీకు ఆమాత్రం తెలియదా అన్నాడు బాబు. తెలుసు కనుకనే అడుగుతున్నాం అన్నారు వాళ్లు. నాలుగేళ్లుగా మన పాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో జనాలకు బాగా అర్థం అయిపోంయింది. ఎలాగూ వచ్చే ఎలక్షన్లో మనకి డిపాజిట్లు దక్కుతాయన్న నమ్మకం కూడా లేదు. ఇక రైతులను నయాన, భయాన బెదిరించి, భూసేకరణ పేరుతో గుంజుకొచ్చిన స్థలం అంతా ఏంకావాలి చెప్పండి...? దేశాలన్నీ తిరిగినా ఒక్కడంటే ఒక్కడూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. అన్నాడు బాబు.
మనసంగతి ఇంటర్నేషనల్ గానూ మన సెల్ఫ్ డబ్బా సంగతి, అవినీతిలో నెంబర్ వన్ పొజిషన్ గురించి అర్థమైపోయుంటుంది అని గుసగుసలాడుకున్నారు తెలుగు తమ్ముళ్లు. 
కరెక్టుగా చెప్పారు. అందుకే ఎన్నికల్లోపు అమరావతిని అవకాశం ఉన్నంత మేరకు అమ్మేద్దామని డిసైడ్ అయ్యాను. ఇలా చెబితే అన్నా రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగి అమరావతిలో నివసించేందుకు వస్తారని ప్లానేసా అన్నాడు బాబు. 
అదా అసలు సంగతి అనుకుంటూ వెనుతిరిగారు తెలుగు తమ్ముళ్లు. 

Labels : YSRCP, YS Jagan, NCBN,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com