Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
పేదలకు అండగా వైయస్సార్సీపీ

Published on : 19-May-2017 | 17:47
 

అమరావతిః కనకదుర్గమ్మ వారధి నేషనల్ హైవే నుంచి స్క్రూ బ్రిడ్జి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న భూములను, ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.  మూడు పంటలు పండే 28 ఎకరాలు,  170 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయాలని ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఎకరం 5కోట్లు పలుకుతుంటే మేం ఇచ్చినంత తీసుకొని ఖాళీ చేయాలని ప్రభుత్వం బెదిరించడంపై ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా 170 ఇళ్లు ఉంటే 70 కుటుంబాలే ఉన్నాయని చూపిస్తూ వాళ్లకు పరిహారం ఇవ్వకుండా వెళ్లగొట్టాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.  తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఏర్పాటు చేసిన మీటింగ్ ను ఎమ్మెల్యే సహాయంతో స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని ఎదురుతిరిగారు. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రోడ్డు వేస్తున్నాడని దుయ్యబట్టారు.   పేదలకు వైయస్సార్సీపీ అండగా ఉందని ఆర్కే భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com