Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్‌: వైయ‌స్ జ‌గ‌న్‌                               పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                 
    Show Latest News
తియ్యగూర వెంకటరెడ్డికి వైయస్ఆర్ సీపీతో సంబంధం లేదు- లేళ్ల అప్పిరెడ్డి

Published on : 14-Dec-2017 | 17:48
 

విజయవాడ :  పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన గుంటురూకు చెందిన తియ్యగూర వెంకటరెడ్డికి వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీతో  ఎటువంటి సంబంధం లేదని పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయనీ, ఇవి వైయస్ఆర్ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలన్నీ కూడా గాంధేయమార్గంలో, అహింసాయుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటున్నాయని, ఇకపై కూడాఉంటాయని ఆయన అన్నారు.  వైయస్ జగన్ అభిమానిని అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా , ఆ వ్యాఖ్యలను వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకీగాని, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గాని ఆపాదించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com