చిత్తూరు(పూతలపట్టు)) గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే మిట్టూరు పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్లు, పింఛన్లు, తాగునీరు, సీసీ రోడ్లు, రహదారులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రజలకు భరోసానిచ్చారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే మండిపడ్డారు.