Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
ఏప్రిల్ 30న వంచ‌న దినం

Published on : 22-Apr-2018 | 09:49
 

నూజివీడు: రాష్ట్రానికి మేలుచేసే ప్రత్యేక హోదాను  తాకట్టుపెట్టి ఎప్పటికప్పుడు మాట మార్చి ..ఇప్పుడు మళ్లీ హోదాకోసం  పోరాడుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ, ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 30 వ తేదీన వంచన దినంగా పాటించాలని తీర్మానించింది. అదే రోజున తిరుపతిలో చంద్రబాబు నాయుడు దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి హోదా విషయంలో తరచు మాట మార్చి, ఇప్పుడు కేంద్రాన్ని నిందిస్తూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు గుర్తించేలా ప్రధాన ప్రతపక్షంగా తన వంతు బాధ్యతగా వంచన దినం నిర్వహించనుంది. 
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడిలో పర్యటిస్తున్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగిరిపల్లి శిబిరం వద్ద ఇటీవల రాజీనామా చేసిన పార్టీ ఎంపీలతో పాటు, ప్రాంతీయ సమన్వయకర్తలు , ఇతర సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సాధన  విషయంలో  చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నాయకులు ధర్ాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు.

ఈ నెల 30 వ తేదీన విశాఖపట్టణంలో నిర్వహించే వంచన దినం నిరాహార దీక్ష కార్యక్రమంలో పార్టీకిచెందిన ముఖ్యనేతలంతా పాల్గొంటారని ధర్మాన వెల్లడించారు. ఆ రోజున 12 గంటల పాటు దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఆ రోజున యథావిధిగా సాగుతుందనీ, యాత్రలో పాల్గొనే  వారంతా నల్లబ్యాడ్జిలు ధరిస్తారని, నల్ల జెండాలు ప్రదర్శిస్తారని చెప్పారు.

రాష్ట్రానికి హోదా విషయంలో రాష్ట్రాన్ని వంచించడంలో  తెలుగుదేశం పార్టీతోపాటు ఎన్ డిఎ కూటమిలోని పక్షాలకు కూడా భాగస్వామ్యముందన్నారు. రాష్ట్రానికి మోసం చేసిన వారి బండారం బయటపెడతామన్నారు. హోదా కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ నాలుగేళ్లుగా నిరంతరం చిత్త శుద్ధితో పోరాడుతోందని వివరించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోనే హోదాను సాధించగలమన్నారు.
హోదా విషయంలో చంద్రబాబు ఒక మోసగాడిగా, రాష్ట్రానికి నష్టం కలిగించిన వ్యక్తిగా నిలచ్పిోతారని పేర్కొన్నారు.
కాగా 30 వ తేదీన తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన మరోదీక్ష మరో మోసం, వంచన అని పేర్కొన్నారు. ఇటుంటి మోసాలను, వేస్తున్న ఎత్తుగడలను సాగనివ్వమని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com