Printed on 23-09-2018 12:09:29 PM

చంద్రబాబు పూటకో అబద్ధం


విజయవాడ:  చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని ఫైర్‌ అయ్యారు. ధర్మ పోరాటం అనే మాట మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని పేర్కొన్నారు. ఊసరవెళ్లి కంటే వేగంగా చంద్రబాబు రంగులు మార్చగలడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని నాని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.