Printed on 14-12-2018 02:33:35 AM

రాజీనామాలపై మాట్లాడే అర్హత చంద్రబాబు, యనమలకు లేదు..
స్వార్థ రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం..
ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో పోరాటాలు చేసింది వైయస్‌ఆర్‌సీపీనే...
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి
స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత,మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, యనమల మా పదవులు త్యాగం గురించి మాట్లాడితే అశ్చర్యం కలుగుతుందన్నారు. జగన్,పవన్‌ మోదీని ప్రశ్నించడంలేదంటారని నాలుగు సంవత్సరాలుగా  బీజేపీతో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉండి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా స్వార్థ రాజకీయాలు కోసం ద్రోహం చేసిన వ్యక్తులు మా రాజీనామాలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం  చిత్తశుద్ధితో  రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమయ్యిందన్నారు. కేంద్ర,రాష్ట పార్టీలు భాగస్వామ్యులుగా  ఉండి ప్రజలచేత ఓట్లు వేయించుకుని మళ్లీ బీజేపీ నుంచి బయటకు వచ్చి నెపం కేంద్రంపై వేసి ప్రత్యేకహోదా కోసం టీడీపీ చేస్తున్న  డ్రామాలకు నిరసనగా రాజీనామాలు చేశామన్నారు. పార్లమెంటు సాక్షిగా పోరాటం చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. మా పదవులు రాజీనామా గురించి చంద్రబాబు,యనమలకు మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు  నైజమన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రకు వెన్నుపోటు పోడిచిన ఘనత చంద్రబాబు నాయుడిదే అని అన్నారు. చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసింది వైయస్‌ జగన్,వైయస్‌ఆర్‌సీపీ  పార్టీలన్నారు. 23 మంది ఫిరాయింపుదార్లపై చర్య తీసుకుంటే ఎన్నికలు వచ్చేవి కాదా అన్నారు. బుట్టా రేణకపై చర్య తీసుకోమని ఫిర్యాదు చేశామని ఆ విషయంలో చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు మాకు మిత్రుడే అని పార్లమెంట్‌ సాక్షిగా రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్‌ చేయించారన్నారు. చంద్రబాబు కోట్లు దోచుకున్న ఆయనపై దాడులు జరగవని విమర్శించారు. దోచుకున్న వ్యక్తులే ఐటిదాడులు జరిగితే కుట్ర అంటూ ప్రచారం చేస్తారన్నారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైయస్‌ జగన్‌ ఆమరణ దీక్ష చేస్తే భగ్నం చేయించింది చంద్రబాబు కాదా అని  ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీతో కలిసి వుంటే వైయస్‌ భారతీపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు.  ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. వంగవీటి రాధా వైయస్‌ఆర్‌సీపీలోనే ఉన్నారని, అనుమానాలకు తావులేదన్నారు. పార్టీ బలబలాలు బట్టి సీటు కేటాయింపులు, మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకునే  నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పొత్తా..

Printed on 14-12-2018 02:33:35 AM

ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పొత్తా..
అధికార దాహంతో చంద్రబాబు సిగ్గులేని రాజకీయాలు..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ  తీరని అన్యాయం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని చంద్రబాబు కలవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిన చంద్రబాబు..రాహుల్‌తో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా కనుగోలు చేసిన చంద్రబాబా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అని మండిపడ్డారు.ఎన్టీఆర్‌కు ఏవిధంగా వెన్నుపోటు పోడిచావో రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు.అధికార దాహంతో సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏనాడు కూడా ఒంటరిగా పోటి చేసిన పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలవడం అనైతికమన్నారు.ఎవరి చెవ్వులో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తర్వాత రెండు సార్లు చంద్రబాబు ఢిల్లీకి చంద్రబాబు వెళ్లారన్నారు.ఈ దాడి ఘటన ఎక్కడ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందోనని భయంతో హత్యాయత్నం ఘటన  నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడడానికి చెప్పి డ్రామాలాడుతున్నారన్నారు.ప్రకాశం జిల్లా ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలకు వెలుగు నింపాలంటే వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2006లో వెలుగొండ పనులు ప్రారంభించారన్నారు.సుమారుగా 60 శాతం పనులు పూర్తిచేయించారన్నారు.టీడీపీ హయాంలో కేవలం 40 శాతం పనులు పూర్తిచేయలేక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి తుంగులో తొక్కారన్నారు.రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెబుతారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.
 
Attachments area