Printed on 17-12-2018 10:50:32 AM

వంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు
వైయస్‌ జగన్‌ పాదయాత్రకు చరిత్రలో సుస్థిర స్థానం
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం
గుంటూరు: పరిపాలన చేయమని గద్దెనెక్కించిన ముఖ్యమంత్రిపైనే రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు వంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు పొందారన్నారు. గుంటూరులో జరుగుతున్న వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘకాలం ప్రజల మధ్యన ఉంటూ పాదయాత్ర చేస్తున్న గొప్ప నాయకుడిగా దేశ చరిత్రలో వైయస్‌ జగన్‌ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. నయవంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. నేను మారాను.. మీరు మారండి.. అనుభవం ఉంది ఒక్క అవకాశం ఇవ్వండి అని నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. మాయమాటలు నమ్మి జనం ఓటేసి అధికారం కట్టబెడితే చంద్రబాబు వెలగబెట్టిన నిర్వాకం ఏంటంటే.. అన్ని వర్గాలను నయవంచనతో మోసం చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను సభలోనే నిర్లజ్జగా, నిసిగ్గుగా ఫ్లోర్‌ క్రాస్‌ చేయించారన్నారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ సర్వనాశనం అయిందని, జన్మభూమి కమిటీలను నియమించి సర్పంచ్‌ల వ్యవస్థను నాశనం చేశారన్నారు. నాలుగేళ్లుగా అవినీతికి పాల్పడుతున్న దొంగను ఆధారాలతో సహా వైయస్‌ జగన్‌ రోడ్డున నిలబెట్టారన్నారు. గాంధీజీ మార్గంలో తాను నమ్మిన సిద్ధాంతం కోసం వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేందుకు ఉద్యమం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 
సిట్‌పై నమ్మకం లేదు...

Printed on 17-12-2018 10:50:32 AM

సిట్‌పై నమ్మకం లేదు...
కుట్రలో శివాజీ కూడా భాగస్వామి..
వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం
శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై రాష్ట్రపోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు జిల్లా అ«ధ్యక్షులు తమ్మినేని సీతారాం అన్నారు. కుట్రలో శివాజీ కూడా భాగస్వామి అని, అతనిని ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో సీసీ పుటేజీని ఎందుకు బయటపెట్టడంలేదన్నారు. గతంలో మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్‌కు పడుతుందనే అనుమానాలున్నాయన్నారు.సిట్‌పై నమ్మకం లేదని న్యాయవిచారణ జరిపించాలన్నారు. థర్డ్‌ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని  ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం..

Printed on 17-12-2018 10:50:32 AM

వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం..
వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం...
శ్రీకాకుళంః ఆమలదాలవలసను అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో హామీలిచ్చి ఒకటి చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.చెరుకు రైతులకు కల్పతరువు లాంటి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటి వరుకూ చర్యలు తీసుకోలేదన్నారు. చెరుకు రైతులు నిరాశలో కూరుకుపోయారన్నారు.ఆమదాలవలస వాణిజ్య కేంద్రం అని దానిపై కూడా ప్రభావం పడిందన్నారు. ఇండిస్ట్రియల్‌ పార్క్‌ అంటూ కలబొల్లి మాటలు చెప్పారన్నారు.100 ఎకరాలు విలువ చేసే భూమిని ఆరుకోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, డిపాజిట్లు కూడా చెల్లించకుండా ఎలా అమ్ముతారని రైతులు కోర్టుకు వెళ్ళారన్నారు. కోర్టు రైతులకు అనుకూలంగా స్పష్టంగా తీర్పు చెప్పిందన్నారు. నాలుగేళ్లుగా ఆమదాలవలసలో అభివృద్ధి లేదన్నారు.ప్రభుత్వం చేతగానితనం వల్లన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.   
అలుపెరగని అవిశ్రాంత యోధుడు వైయస్‌ జగన్‌..

Printed on 17-12-2018 10:50:32 AM

అలుపెరగని అవిశ్రాంత యోధుడు వైయస్‌ జగన్‌..
శ్రీకాకుళంఃప్రజల కోసం మహానేత తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  అలుపెరగని పోరాటం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడానికి ఉద్యమస్ఫూర్తితో జననేత కదులుతున్నారన్నారు.ప్రతిపక్ష పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలను పశువులను కొనట్లు కొని అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. శాసన సభలో మాట్లాడదామంటే కనీసం మైక్‌ కూడా ఇవ్వరని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయండి అని కోరితే  పట్టించుకోకుండా  ఏపీ శాసన సభ స్పీకర్‌ రాజ్యాంగ వ్యవస్థను మంటకలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నలుగురికి మంత్రులు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ప్రతిపక్షపార్టీలో ఉంటే డబ్బులు రావని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి దోపిడీ వ్యవస్థకు తలుపు తెరిచారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దొరికింది దొరికినట్టుగా సహ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు  వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, న్యాయం కోసం ఏ పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళిన ఏ పార్టీకి చెందినవారని అడుగుతున్నారని మండిపడ్డారు.  ఏపీ ప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్న అవిశ్రాంత సమరయోధుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు.  పక్క రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశారని అవినీతి పాలన ఎంతో కాలం  సాగదన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని తుదిముట్టిæంచే చర్యలకు ఏపీ ప్రజలు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు.