Printed on 20-11-2017 05:42:16 AM

ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్ జగన్
అమరావతిః రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అమరావతిలోని అసెంబ్లీకి చేరుకున్నారు.   పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన వైయస్ జగన్ ఓటింగ్ ప్రారంభమైన కొంత సమయానికి అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత వైయస్ జగన్ అక్కడే తన ఛాంబర్‌లో కొద్దిసేపు ఉండి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.  పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వైయస్సార్సీపీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైయస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్, మిథున్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఎంపీ మేకపాటి నివాసంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన నేతలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.