Printed on 20-04-2018 06:36:58 AM

సంతాపం తెలిపిన వైఎస్ జగన్
హైదరాబాద్) మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ కి సతీ వియోగం కలగటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. అద్వానీ భార్య కమలా అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్బంగా బీజేపీ అగ్ర నేత అద్వానీ కి వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియపరిచారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.