Printed on 24-05-2018 09:43:02 AM

వైఎస్ జగన్ సంతాపం
మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు మృతి పట్ల ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల జననేత సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆనందగజపతి రాజు కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైఎస్ జగన్ పరామర్శ

Printed on 24-05-2018 09:43:02 AM

వైఎస్ జగన్ పరామర్శ
ప్రకాశం: ప్రత్యర్థుల దాడిలో హతమైన వైఎస్సార్సీపీ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. సంతమాగులూరు  సర్పంచ్‌ గడ్డం వెంకటరెడ్డి(45)పై ప్రత్యర్థులు దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆరుబయట చెట్టు కింద కూర్చున్న వెంకట్ రెడ్డిపై అదే  గ్రామానికి చెందిన ఆరుగురు గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాద ఘటనపై  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ మృతి పట్ల  వైయస్ జగన్ సంతాపం తెలిపారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. కర్నూలు జలదీక్షలో ఉన్న వైయస్ జగన్ ప్రమాదవార్త విని షాక్ కు గురయ్యారు.  

వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం
హైదరాబాద్ః  ప్ర‌ముఖ సంగీత‌కార‌ణి, గాయ‌కురాలు వింజమూరి సీతాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన సంతాపం తెలిపారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సంగీతకారిణిగా, గాయకురాలిగా ఆమె తెలుగు జాన‌ప‌ద సంగీతానికి ఎంతో కృషి చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త చింతా కృష్ణమూర్తి మృతిపట్ల ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చింతా కృష్ణమూర్తి మృతికి తన సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్ః ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు. అంజయ్య మృతికి సంతాపం తెలిపారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కనూగాంధీ మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

కనూగాంధీ మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్ః మహాత్మాగాంధీ మనుమడు కనూగాంధీ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. సూరత్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనూగాంధీ మరణించారు.
ఫిడెల్ క్యాస్ట్రోకు నివాళి

Printed on 24-05-2018 09:43:02 AM

ఫిడెల్ క్యాస్ట్రోకు నివాళి
హైదరాబాద్ః ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన గొప్ప నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ప్రపంచ గర్వించదగ్గ నేత ఫిడెల్ట్ క్యాస్ట్రో అని  వైయస్ జగన్ కొనియాడారు. 1959 నుంచి 76 వరకు క్యూబా ప్రధానిగా. 76 నుంచి 2008వరకు ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా అధ్యక్షుడిగా వ్యహరించారు.అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

అద్భుతమైన పోరాటస్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత ఫెడల్‌ క్యాస్ట్రో అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) మరణించిన క్యూబా మాజీ అధినేత ఫెడల్‌ క్యాస్ట్రోకు వైయస్‌ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు విడుదలచేసిన ఒక ప్రకటనలో క్యాస్ట్రో పోరాట పంథాను శ్లాఘించారు.

అమెరికాకు అతి సమీపంగా ఉంటూ, అగ్రరాజ్యానికి కించిత్‌ తల వంచని ధీశాలి క్యాస్ట్రో అని, చిన్నదేశమే అయినప్పటికీ ఎవ్వరికీ గులాము కాకుండా క్యూబా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘమని, తన పట్టుదల, నిబ్ధతతో క్యూబాను, క్యూబన్లను నడిపించిన మహానేత ఫెడల్‌ క్యాస్ట్రోఅని వైయస్‌ జగన్‌ కీర్తించారు. 50 ఏళ్లపాటు క్యాస్ట్రో పాలనలో క్యూబా ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
ఉపాధి లేక పొట్టకూటి కోసం హైదరాబాద్ కు
భవనం కుప్పకూలిన ఘటనలో పలువురి మృతి
ఘటనాస్థలాన్ని పరిశీలించిన బొత్స, గట్టు
మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్ః నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై  వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర కలత చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వైయస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తదితరులు నానక్ రాంగూడ ఘటనాస్థలిని పరామర్శించారు. భవనం కుప్పకూలిన ఘటనపై మరణించిన కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్నికోరారు. ఉపాధి లేక పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చారని, ఏపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  శ్రీనగర్ కాలనీ నాగార్జునగర్‌లోని స్వగృహంలో ఉదయం ఆయన మృతిచెందారు. 

తెలుగు జర్నలిజంలో హనుమంతరావుకు 65 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కృష్ణా పత్రిక, ఈనాడు, ఎకనమిక్ టైమ్స్ తదితర సంస్థల్లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. డేటా న్యూస్ ఫీచర్స్(డీఎన్‌ఎఫ్) ఏజెన్సీని స్థాపించి నిర్వహించారు. 

వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు.  కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్‌ సోమవారం తన నివాసంలో మరణించారు. శివశంకర్‌ కేంద్రమంత్రితో పాటు, సిక్కిం గవర్నర్‌గా కూడా పనిచేశారు.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్ః  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గుండెపోటుతో భూమా నాగిరెడ్డి  మృతి చెందారు. రేపు ఆళ్లగడ్డలో నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
కర్నూలుః వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అధ్యక్షులు వైయస్ జగన్ చరితారెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. బాలనాగమ్మ మృతికి సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రి మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

కేంద్ర మంత్రి మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం
హైద‌రాబాద్‌: కేంద్రమంత్రి అనిల్‌ మాధవ్‌ దవే ఆకస్మిక మృతిపట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 
దాసరి నారాయణరావు మృతికి సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

దాసరి నారాయణరావు మృతికి సంతాపం
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దర్శకరత్న, ఇండియన్ సినిమా లెజండ్ దాసరి నారాయణరావు మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దాసరి నారాయణ రావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 దాసరి నారాయణ రావు మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. దశాబ్ధాలుగా సినీరంగానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడారు. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే గాకుండా,  బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు, రచయిత, ప్రయోక్త, సామాజిక ఉద్యమకారుడు, పత్రికాధిపతి, మంచి మనిషిగా దాసరి నారాయణ రావు ఎప్పటికీ చిరస్మరణీయుడని పేర్కొన్నారు.  

కాగా, కిమ్స్‌ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దాసరి మృతి చెందారు.  చికిత్స సమయంలో అకస్మాత్తుగా గుండె పని చేయకపోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌)తో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. 


సీపీఐ నేత శర్మ మృతికి వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

సీపీఐ నేత శర్మ మృతికి వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్ః సీపీఐ నేత శర్మ మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శర్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వైయస్ జగన్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

వైయస్ జగన్ సంతాపం
హైదరాబాద్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్‌కే ప్రసాద్‌ (77) మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన గుండెపోటుతో కేర్‌ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పీవీఆర్‌కే ప్రసాద్‌ కుటుంబసభ్యులకు వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే  కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పీపీరావు మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

పీపీరావు మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం
హైద‌రాబాద్‌: సీనియ‌ర్ సుప్రీం కోర్టు న్యాయ‌వాది పావ‌ని ప‌ర‌మేశ్వ‌ర‌రావు(పీపీరావు) మృతి ప‌ట్ల  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం తెలిపారు.  ప్ర‌కాశం జిల్లాకు చెందిన పీపీరావు న్యాయ‌వాదిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని వైయస్ జగన్ కొనియాడారు. ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ క‌మిటీలు, వేదిక‌ల్లో  భాగ‌స్వామ్యులై నిర్వ‌హించిన పాత్ర ఎన‌లేనిద‌ని, పీపీరావు సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. పీపీరావు కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

సీనియర్ జర్నలిస్టు మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం
హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌ సురేష్‌ కృష్ణమూర్తి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సురేష్‌ మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కార్టూనిస్ట్ మోహన్ మృతికి సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

కార్టూనిస్ట్ మోహన్ మృతికి సంతాపం
హైదరాబాద్ః ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. తెలుగు పత్రికా రంగంలో మోహన్ ఓ ధృవతార అని వైయస్ జగన్ అన్నారు. కార్టూనిస్టుగా దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  మోహన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ నేటి ఉదయం కన్నుమూశారు.
ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు పితృవియోగం

Printed on 24-05-2018 09:43:02 AM

ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు పితృవియోగం
కృష్ణా: నూజివీడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తండ్రి మృతి చెందారు. గుండెపోటుతో ఎమ్మెల్యే తండ్రి మేకా వెంకట శ్వేతా చలపతి గోపాల అప్పారావు (90) కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 
సూరంపల్లి మృతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ సంతాపం

Printed on 24-05-2018 09:43:02 AM

సూరంపల్లి మృతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ సంతాపం
చిత్తూరు: విజయవాడకు సమీపంలోని సూరంపల్లి పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పొయిన వారికి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.